Site icon NTV Telugu

Army Officer Suicide: ఆర్మీ అధికారి ఆత్మహత్య.. భార్యను హత్య చేసి..

Suicide

Suicide

Army Officer Suicide: పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌లో ఓ ఆర్మీ అధికారి తన భార్యను హత్య చేసి ఆదివారం రాత్రి తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనకు ముందు క‌ల్నల్ ఓ సూసైడ్ నోట్ కూడా రాశారు. త‌న భార్యకు హాని చేసిన‌ట్లు ఆ ఆఫీస‌ర్ త‌న లేఖ‌లో తెలిపారు. భార్యాభ‌ర్తల మ‌ధ్య కొన్నాళ్లుగా త‌గాదాలు ఉన్నాయి. ఇద్దరూ త‌రుచుగా కౌన్సిలింగ్‌కు వెళ్తున్నారు. ఈ ఘ‌ట‌న‌పై ఆర్మీతో పాటు పంజాబ్ పోలీసులు విచార‌ణ చేప‌డుతున్నారు. ఆర్మీ అధికారుల అధికారిక ప్రకటన ప్రకారం.. ఆ అధికారి ఆదివారం రాత్రి 9 గంటలకు యూనిట్ లైన్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు.

Orissa High Court: అలా చేయడం అత్యాచారం కిందకు రాదు.. ఒరిస్సా హైకోర్టు సంచలన తీర్పు

ఆర్మీ అధికారుల ప్రకారం, లెఫ్టినెంట్ కల్నల్ మృతదేహానికి సమీపంలో దొరికిన సూసైడ్ నోట్‌లో, తన భార్యకు హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. భార్య కూడా అతని నివాసంలో శవమై కనిపించిందని అధికారిక ఆర్మీ ప్రకటన పేర్కొంది. ఈ జంటకు వైవాహిక సమస్యలు ఉన్నాయని, వారికి రెగ్యులర్ కౌన్సెలింగ్ సెషన్స్ జరుగుతున్నాయని అధికారులు తెలిపారు. దీనిపై ఆర్మీ, పంజాబ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇప్పుడు ఆర్మీ, పంజాబ్ పోలీసులు ఇద్దరూ ఈ విషయంపై సమగ్ర దర్యాప్తు ప్రారంభించారని ఆ ప్రకటనలో తెలిసింది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Exit mobile version