Orissa High Court: అలా చేయడం అత్యాచారం కిందకు రాదు.. ఒరిస్సా హైకోర్టు సంచలన తీర్పు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Orissa High Court Gives Shocking Judgement In Woman Assault Case: సోమవారం ఒరిస్సా హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. పరస్పర అంగీకారంతో శృంగారంలో పాల్గొంటే.. అది అత్యాచారం కిందకు ఏమాత్రం రాదని స్పష్టం చేసింది. ఒక అత్యాచారం కేసు విచారణలో భాగంగా.. హైకోర్టు ఈ మేరకు జడ్జ్‌మెంట్ ఇచ్చింది. ఆ వివరాల్లోకి వెళ్తే.. భువనేశ్వర్‌కి 40 కిలోమీటర్ల దూరంలోని నిమపారకు చెందిన ఒక వ్యక్తి.. ప్రేమ పేరుతో ఒక మహిళ వెంటపడ్డాడు. నువ్వు లేకుండా ఉండలేనని, పెళ్లి కూడా చేసుకుంటానని నమ్మించాడు. అతని మాటల్ని నమ్మి, ఆ మహిళ కూడా అతడ్ని ప్రేమించింది. పెళ్లి పేరుతో భువనేశ్వర్ తీసుకెళ్లి, అక్కడ కొన్ని రోజుల పాటు ఆమెతో సహజీవనం చేశాడు. ఈ క్రమంలో ఆమె పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చిన ప్రతీసారి.. అదిగో అప్పుడు, ఇదిగో ఇప్పుడు అంటూ మాట దాటవేస్తూ వచ్చాడు. చివరికి ఒక రోజు ఉన్నట్టుండి ఆమెని వదిలి పారిపోయాడు.
Delhi Car Horror: మృతురాలు అంజలి ఇంట్లో దోపిడీ.. చేసింది ఫ్రెండ్ నిధినే!
Also Read
- Blood Donation Camp: రక్తదాన శిబిరంలో 'కులం' కలకలం.. తమిళనాడులో వివాదం
- BrahMos Missile Export: డిఫెన్స్ రంగంలో భారత్ సత్తా.. బ్రహ్మోస్ ఎగుమతులతో గ్లోబల్ మార్కెట్లో దూకుడు
- Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
- Maharashtra Tragedy: బీచ్ ట్రిప్‌లో విషాదం.. నీటిలో మునిగి 8 మంది స్టూడెంట్స్ మృతి..
దీంతో.. ఆ మహిళ అతనిపై కేసు పెట్టింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి, తనపై అత్యాచారానికి పాల్పడ్డానని తన ఫిర్యాదులో పేర్కొంది. ఆమె ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు.. అతని ఆచూకీ కనుగొని అరెస్ట్ చేశారు. బెయిల్ కోసం అతడు జిల్లా కోర్టులో దరఖాస్తు చేసుకోగా.. న్యాయస్థానం అందుకు నిరాకరించింది. దాంతో అతడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు.. వాదనలు విన్న తర్వాత నిందితుడికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అతడు పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చినప్పటికీ.. ఇద్దరు పరస్పర అంగీకారంతోనే సహజీవనం చేశారు కాబట్టి, దీనిని అత్యాచారంగా పరిగణించలేమని హైకోర్టు పేర్కొంది. మరోవైపు.. తనపై కేసు పెట్టినందుకు మహిళను బెదిరించే పనులకు పాల్పడకూడదని నిందితుడ్ని కోర్టు హెచ్చరించింది. కేసు విచారణకు పూర్తిగా సహకరించాలని అతనికి ఆదేశాలు జారీ చేసింది.
Supreme Court: మతమార్పిడి తీవ్రమైన సమస్య.. దీన్ని రాజకీయం చేయొద్దు
తాజావార్తలు
-
Pulsar NS400Z: Pulsar NS400Z కొత్త వెర్షన్ లాంచ్.. TFT డిస్‌ప్లే, Google Maps సహా మరిన్ని స్మార్ట్ ఫీచర్లు
-
Royal Enfield Himalayan 440కు మైండ్ బ్లాకింగ్ రెస్పాన్స్.. కొత్త కస్టమర్లకు షాక్ ఇచ్చిన రాయల్ ఎన్ఫీల్డ్!
-
Blood Donation Camp: రక్తదాన శిబిరంలో ‘కులం’ కలకలం.. తమిళనాడులో వివాదం
-
Vaishnav Tej: 100 కోట్ల హిట్టు కొట్టినా.. ‘ఉప్పెన’ హీరో ఏం చేస్తున్నాడు?.. ఇంత గ్యాప్ ఎందుకు?
-
Sardar 2 : కార్తీపై గుర్రుగా ఉన్న తమిళనాడు థియేటర్స్ యాజమాన్యం
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?