Site icon NTV Telugu

Sachin Tendulkar Son: సచిన్ కొడుకు అర్జున్ టెండూల్కర్ ఎంగేజ్మెంట్.. కాబోయే వధువు ఎవరో తెలుసా?

Arjun Tendulkar

Arjun Tendulkar

క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. సచిన్ ఇంట్లో పెళ్లి బాజాలు మోగనున్నాయి. సైలెంట్ గా అర్జున్ టెండూల్కర్ నిశ్చితార్థం జరిగింది. అర్జున్ టెండూల్కర్ రవి ఘాయ్ మనవరాలు సానియా చందోక్‌తో నిశ్చితార్థం జరిగింది. అర్జున్, సానియా ఒక ప్రైవేట్ వేడుకలో నిశ్చితార్థం చేసుకున్నారు. రెండు కుటుంబాల సన్నిహితులు, స్నేహితులు నిశ్చితార్థానికి హాజరయ్యారు. ఘాయ్ కుటుంబం ముంబైకి చెందిన ప్రసిద్ధ వ్యాపార కుటుంబం. వారు ఇంటర్ కాంటినెంటల్ మెరైన్ డ్రైవ్ హోటల్, బ్రూక్లిన్ క్రీమరీ యజమానులు.

Also Read:Earthquake: వికారాబాద్ జిల్లా పరిగి మండలంలో స్వల్ప భూకంపం

అర్జున్ టెండూల్కర్ ఇప్పటివరకు 17 ఫస్ట్ క్లాస్, 18 లిస్ట్-ఎ మరియు 24 టి20 మ్యాచ్‌లు ఆడాడు. ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లలో, అర్జున్ 33.51 సగటుతో 37 వికెట్లు పడగొట్టాడు. అతను 23.13 సగటుతో 532 పరుగులు చేశాడు. లిస్ట్-ఎ క్రికెట్‌లో, అర్జున్ 25 వికెట్లు (సగటున 31.2), 102 పరుగులు (సగటున 17) సాధించాడు. T20 క్రికెట్‌లో, 25 ఏళ్ల అర్జున్ టెండూల్కర్ 25.07 సగటుతో 27 వికెట్లు పడగొట్టాడు. 13.22 సగటుతో 119 పరుగులు కూడా చేశాడు. అర్జున్ దేశీయ క్రికెట్‌లో గోవా జట్టులో భాగం. గతంలో, అతను ముంబై తరపున ఆడేవాడు. అర్జున్ ఇప్పటివరకు IPLలో ముంబై ఇండియన్స్ తరపున 5 మ్యాచ్‌లు ఆడాడు, అందులో అతను 3 వికెట్లు, 13 పరుగులు సాధించాడు.

Also Read:POCSO Case: ఛీ.. ఛీ.. ప్రియుడితో కన్న కూతురిపైనే అత్యాచారం చేయించిన తల్లి!

సచిన్ టెండూల్కర్ 1995 మే 24న అంజలి టెండూల్కర్‌ను వివాహం చేసుకున్నారు. అంజలి తన భర్త సచిన్ టెండూల్కర్ కంటే ఆరు సంవత్సరాలు పెద్దది. అంజలి వృత్తిరీత్యా శిశువైద్యురాలు. సచిన్-అంజలి దంపతులకు ప్రియమైన కుమార్తె సారా టెండూల్కర్ 12 అక్టోబర్ 1997న జన్మించింది. ఆ తర్వాత 1999 సెప్టెంబర్ 24న అర్జున్ టెండూల్కర్‌ జన్మించాడు.

Exit mobile version