NTV Telugu Site icon

Paris Olympics 2024: భారత్ కు బ్యాడ్ న్యూస్..తృటిలో తప్పిన పతకం..

Paris Olympic

Paris Olympic

10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్ నుంచి భారత్‌కు బ్యాడ్ న్యూస్ వచ్చింది. అర్జున్ సింగ్ చీమా, సరబ్జోత్ సింగ్ ఫైనల్స్‌కు చేరుకోవడంలో విఫలమయ్యారు. ఈ ఈవెంట్‌లో 33 మంది షూటర్లు పాల్గొన్నారు. టాప్-8లో నిలిచిన వ్యక్తి ఫైనల్స్‌లో చోటు దక్కించుకున్నాడు. భారత్‌కు చెందిన సరబ్‌జోత్ సింగ్ 577 పాయింట్లతో 9వ స్థానంలో నిలిచాడు. ఒక్క పాయింట్ తేడాతో ఫైనల్స్ కి చేరుకోలేకపోయాడు. కాగా.. అర్జున్ సింగ్ చీమా 574 పాయింట్లతో 18వ స్థానంలో నిలిచాడు. 8వ ర్యాంక్‌లో ఉన్న జర్మనీకి చెందిన రాబిన్ వాల్టర్ కూడా 577 పాయింట్లు సాధించాడు. వాల్టర్ ఫైనల్స్‌కు చేరుకున్నాడు.

READ MORE: High Court: పెళ్లైనవారు ‘‘సహ జీవనం’’పై హైకోర్టు సంచలన తీర్పు.. తల్లిదండ్రుల పరవు తీస్తున్నారంటూ..

కాగా.. నేటి నుంచి ఒలింపిక్స్‌ ప్రారంభమయ్యాయి. తొలిరోజు రోయింగ్, షూటింగ్, బ్యాడ్మింటన్, టెన్నిస్, టేబుల్ టెన్నిస్, బాక్సింగ్, హాకీ ఈవెంట్లలో భారత క్రీడాకారులు పాల్గొంటున్నారు. షూటింగ్‌లో మెడల్ ఈవెంట్ కూడా ఉంది. మిక్స్‌డ్‌ 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ టీమ్‌ క్వాలిఫికేషన్‌తో పాటు నేడు ఫైనల్‌ జరగనుంది. ప్రముఖులలో పీవీ సింధు కూడా నేడు పోటీ పడాల్సి ఉంది. సాత్విక్‌సాయిరాజ్‌ రంకిరెడ్డి, చిరాగ్‌ శెట్టి జోడీపై ఆశలు ఉన్నాయి.

READ MORE: High Court: పెళ్లైనవారు ‘‘సహ జీవనం’’పై హైకోర్టు సంచలన తీర్పు.. తల్లిదండ్రుల పరవు తీస్తున్నారంటూ..

పారిస్ ఒలింపిక్స్‌లో చైనా ఖాతా తెరిచింది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో గోల్డ్ మెడల్ మ్యాచ్‌లో చైనా 16-12తో దక్షిణ కొరియాను ఓడించింది. హువాంగ్ యుటింగ్, షెంగ్ లిహావో ఈ స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నారు. యుటింగ్‌కు 19 ఏళ్లు కాగా షెంగ్‌కు 17 ఏళ్లు మాత్రమే. క్వాలిఫికేషన్ రౌండ్‌లోనూ చైనా జోడీ అగ్రస్థానంలో నిలిచింది. ఈ ఈవెంట్‌లో ఈ జంట ప్రపంచ ఛాంపియన్‌గా కూడా నిలిచింది.