Site icon NTV Telugu

Srisailam Temple: శ్రీశైలంలో యథావిథిగా ఆర్జిత సేవలు..

Srisailam

Srisailam

Srisailam Temple: ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో శ్రీ మల్లికార్జున స్వామి, భ్రమరాంబిక దేవి అమ్మవారి ఆర్జితసేవలు యథావిథిగా కొనసాగించనున్నారు.. అయితే, శ్రీశైలంలో మహా కుంభాభిషేకం కారణంగా ఈనెల 25 నుండి 31వ తేదీ వరకు అన్ని ఆర్జితసేవలు నిలుపుదల చేస్తున్నట్టు ముందుగా ప్రకటించింది దేవస్థానం.. కానీ, మహా కుంభాభిషేకం వాయిదా పడటంతో యథావిథిగా అన్ని ఆర్జిత సేవలను ప్రారంభించినట్టు ఆలయన కమిటీ ప్రకటించింది.. ఇక, ఆన్‌లైన్‌లో టికెట్స్‌ కూడా భక్తులకు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది.. మరోవైపు జూన్ నెలకు సంబంధించిన ఆర్జిత సేవలకు సంబంధించిన టికెట్స్ కూడా ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచింది దేవస్థానం.

Read Also: Telangana Decade Celebrations: తెలంగాణ దశాబ్ధి ఉత్సవాల షెడ్యూల్‌ విడుదల.. 21 రోజుల పాటు ఉత్సవాలు..

మరోవైపు.. శ్రీశైలంలో మహా కుంభాభిషేకం నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వలన్న పిటిషన్ పై ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో విచారణ జరిగింది.. కార్తీక మాసంలో ఈ కార్యక్రమం చేయాలని వాయిదా వేసినట్టు కోర్టుకు తెలిపింది ప్రభుత్వం.. అయితే, కార్తీక మాసం రోజున వేరే కార్యక్రమాలు ఉంటాయని, ఇప్పుడు చేసిన ఏర్పాట్లు అప్పుడు వచ్చిన భక్తులకు ఇబ్బందిగా మారతాయని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు పిటిషనర్.. అన్ని సలహాలు తీసుకుని కార్యక్రమం నిర్వహణకు ఏర్పాట్లు చేయవచ్చు కదా అని హైకోర్టు సూచించింది.. మళ్లీ కార్తీక మాసం రోజున ఏర్పాట్లు చేయాలా? అని న్యాయస్థానం ప్రశ్నించింది.. ఇరు వర్గాల వాదనలు విని తీర్పు తర్వాత ఇస్తామని పేర్కొంది న్యాయస్థానం.

Exit mobile version