Site icon NTV Telugu

Wedding Party: పెళ్లి విందులో చపాతీలు లేవని గొడవ.. ఒకరిపై ఒకరు కుర్చీలతో దాడి

Chapathi

Chapathi

ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన బరేలీలోని నవాబ్‌గంజ్‌లో ఓ యువకుడి పెళ్లి విందులో చపాతీల విషయంలో ఘర్షణ తలెత్తింది. అయితే.. కొందరు యువకులు వేడి వేడి చపాతీలు తమకు అందలేదని తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. దీంతో.. తమకు చపాతీలు ఇవ్వలేదని నానా హంగామా సృష్టించారు. ఈ క్రమంలో.. యువకులకు, వరుడి కుటుంబీకుల మధ్య గొడవ జరిగింది. దీంతో.. ఇరువర్గాలు ఒకరిపై ఒకరు కుర్చీలు విసురుకున్నారు. కాగా.. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Read Also: CM Revanth: కేంద్రమంత్రి జేపీ న‌డ్డాతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం..

నగరంలోని మొహల్లా బంజరన్‌లో నివాసముంటున్న మహ్మద్‌ డానిష్‌ మొబైల్‌ షాప్ నిర్వహిస్తున్నాడు. అయితే.. ఆదివారం రోజున అతని పెళ్లి జరిగింది. పట్టణంలోని సర్తాజ్ బారత్ ఘర్‌లో శనివారం రాత్రి ఆయన పార్టీ ఏర్పాటు చేశారు. అయితే.. ఆ పార్టీకి హాజరైన కొందరు యువకులు తమకు వేడి వేడి రోటీలు అందించలేదని అక్కడ ఉన్న క్యాంటీన్ సిబ్బందితో గొడవ పడ్డారు. ఆ తర్వాత.. వరుడి కుటుంబీకులు జోక్యం చేసుకుని సర్ది చెప్పే క్రమంలో.. వారితోనూ వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో.. ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఇరువర్గాలు ఒకరిపై ఒకరు కుర్చీలు విసురుకోవడంతో పలువురు గాయపడ్డారు.

Read Also: Minister Sandhya Rani: దేశ విదేశాల్లో అరకు కాఫీ ప్రమోట్.. రాష్ట్ర వ్యాప్తంగా చైన్ షాపులు..!

గొడవ జరుగుతున్న సమయంలో అక్కడున్న కొంత మంది.. ఆపడానికి ప్రయత్నించారు. మరికొందరు గొడవ జరుగుతుంటే ఆపకుండా.. ఫోన్లో రికార్డు చేశారు. కాసేపటి తర్వాత.. గొడవ సద్దుమణిగడంతో ఎక్కడ వారు అక్కడికి వెళ్లిపోయారు. అనంతరం.. ఈ గొడవకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేశారు. అయితే.. ఈ వీడియోను చూసిన స్థానిక పోలీసులు.. ఈ విషయంపై ఇంకా ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు. ఎవరైనా ఈ ఘటనకు సంబంధించి ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Exit mobile version