NTV Telugu Site icon

Argentina: అబ్బాయిల వల్లే కాదు.. అమ్మాయిలు ఇన్ని పరుగులేంట్రా బాబు.. రికార్డు బద్దలు

Argentina

Argentina

అబ్బాయిల వల్ల కానీ పనిని అమ్మాయిలు చేశారు. దాంతో ప్రపంచ రికార్డు సృష్టించారు. బ్యూనోస్ ఎయిర్స్ నగరంలో చిలీతో జరిగిన మ్యాచ్ లో అర్జెంటీనా మహిళల క్రికెట్ జట్టు టీ20 క్రికెట్లో చరిత్ర సృష్టించారు. టీ20 క్రికెట్లో ఓ ఇన్నింగ్స్ లో 427 అత్యధిక పరుగులు చేసిన జట్టుగా అర్జెంటీనా వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేశారు. అర్జెంటీనా అమ్మాయిలు లూసియా టేలర్, ఆల్బర్టినా గలాన్ పరుగుల వదరను పారించారు. లూసియా టేలర్ 84 బంతుల్లో 169 పరుగులు చేయగా, గలాన్ 84 బంతుల్లో 145 (నాటౌట్) పరుగులు సాధించింది. టేలర్ బ్యాటింగ్ లో 27 ఫోర్లు, గలాన్ 23 ఫోర్లు కొట్టారు. ఇంకో విశేషమేంటంటే వీరిద్దరి బ్యాట్ ద్వారా ఒక్క సిక్స్ రాకుండానే ఇంతటి విధ్వంసం సృష్టించారు.

SuryaKumar Yadav: ఓ అభిమానిపై మిస్టర్ 360 ఫైర్..’నాకు ఆదేశాలు ఇవ్వొద్దు…’ అంటూ మండిపాటు

ఇంతకుముందు ఆడిన మ్యాచ్ ల్లో లూసియా టేలర్ అత్యధిక వ్యక్తిగత స్కోరు 29 పరుగులే మాత్రమే… అయితే ఏమంత అనుభవం లేని టేలర్.. చిలీ బౌలర్లకు చుక్కలు చూపించింది. దీంతో ఆమే కెరీర్ లో మూడంకెల స్కోరు నమోదు చేసింది. అంతేకాకుండా.. ఈ మ్యాచ్ తో అనేక వరల్డ్ రికార్డులు నమోదయ్యాయి. గతేడాది సౌదీ అరేబియాపై బహ్రెయిన్ 318 పరుగులు చేసింది. ఇప్పుడా రికార్డును అర్జెంటీనా బద్దలుకొట్టింది. అర్జెంటీనా ఓపెనర్లు లూసియా టేలర్, ఆల్బర్టినా గలాన్ తొలి వికెట్ కు 350 పరుగులు చేశారు… ఇది కూడా ఓ రికార్డే. పురుషుల క్రికెట్లోనూ, మహిళల క్రికెట్లోనూ ఏ వికెట్ కైనా ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం. అంతేకాకుండా.. ఓ టీ20 మ్యాచ్ ల్లో ఒకే ఇన్నింగ్స్ లో ఇద్దరు బ్యాటర్లు సెంచరీ చేయడం ఇదే తొలిసారి. అర్జెంటీనా మహిళల జట్టు వీరవిహారంతో క్రికెట్ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది.

TCS: జాబ్ చేయలనుకునేవారికి గుడ్ న్యూస్.. ఆ కంపెనీలో 40వేల మందికి ఫ్రెషర్లకు ఛాన్స్

ఇదిలా ఉంటే.. చిలీ బౌలర్లలో ఫ్లోరెన్సియా మార్టినెజ్ ఒక ఓవర్లో ఏకంగా 17 నోబాల్స్ వేసి చెత్త రికార్డును మూటగట్టుకుంది. ఆ ఓవర్లో రికార్డు స్థాయిలో 52 పరుగులు వచ్చాయి. భారీ స్కోరు లక్ష్యచేధనలో బరిలోకి దిగిన చిలీ జట్టు కేవలం 63 పరుగులకే కుప్పకూలింది. కేవలం జెసికా మిరాండా అత్యధికంగా 27 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో చిలీ బౌలింగ్ లో 64 నోబాల్స్ వేశారు. అది కూడా ఒక రికార్డుగా మారింది. అర్జెంటీనా జట్టు ఐసీసీ ర్యాంకింగ్స్ లో 66వ స్థానంలో ఉండగా, తగినన్ని మ్యాచ్ లు ఆడని కారణంగా చిలీకి ఇంకా ర్యాంకింగ్ ఇవ్వలేదు. మరోవైపు పురుషుల టీ20 క్రికెట్లో ఇంత స్కోరు ఏ జట్టు సాధించలేకపోయింది. పురుషుల టీ20 క్రికెట్లో అత్యధిక స్కోర్ రికార్డు నేపాల్ పేరిట ఉంది. గత నెలలోనే నేపాల్ జట్టు మంగోలియాపై 20 ఓవర్లలో 3 వికెట్లకు 314 పరుగులు చేసింది.