అబ్బాయిల వల్ల కానీ పనిని అమ్మాయిలు చేశారు. దాంతో ప్రపంచ రికార్డు సృష్టించారు. బ్యూనోస్ ఎయిర్స్ నగరంలో చిలీతో జరిగిన మ్యాచ్ లో అర్జెంటీనా మహిళల క్రికెట్ జట్టు టీ20 క్రికెట్లో చరిత్ర సృష్టించారు. టీ20 క్రికెట్లో ఓ ఇన్నింగ్స్ లో 427 అత్యధిక పరుగులు చేసిన జట్టుగా అర్జెంటీనా వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేశారు.