Site icon NTV Telugu

AR Rahman : రెహమాన్ వర్సెస్ ట్రోలర్స్.. మద్దతుగా నిలిచిన ప్రముఖ రచయిత వరుణ్!

Ar Rehman

Ar Rehman

ఆస్కార్ విజేత, సంగీత దిగ్గజం ఏఆర్ రెహమాన్ గత కొద్దిరోజులుగా వార్తల్లో నిలుస్తున్నా విషయం తెలిసిందే. ముఖ్యంగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. బాలీవుడ్‌లో తన మతం కారణంగా కొన్ని అవకాశాలు రాలేదని చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. ఈ వ్యాఖ్యలపై నెట్టింట పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో, రెహమాన్ వెంటనే స్పందిస్తూ ఒక వీడియో సందేశం ద్వారా వివరణ ఇచ్చారు. తన ఉద్దేశం ఎవరినీ బాధపెట్టడం కాదని, భారతదేశమే తన గురువు, తన ఇల్లు అని చెబుతూ క్షమాపణలు కోరారు. దీంతో వివాదం సద్దుమణిగిందని అందరూ భావిస్తున్న తరుణంలో, ప్రముఖ రచయిత వరుణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కొత్త చర్చకు దారితీశాయి.

Also Read : Yellamma : ‘ఎల్లమ్మ’లో దేవిశ్రీ ప్రసాద్‌తో పాటు సీనియర్ హీరో?

రెహమాన్ సంగీతం అందించిన ‘ఓ పాలన్‌హారే’ వీడియోను షేర్ చేస్తూ వరుణ్ సంచలన పోస్ట్ చేశారు.. ‘గత మూడు దశాబ్దాలుగా అద్భుతమైన సంగీతాన్ని అందించిన ఒక గొప్ప కళాకారుడు, తన అనుభవం ఆధారంగా ఒక అభిప్రాయాన్ని చెబితే ఆయనపై దాడి చేసి దుర్భాషలాడారు. ఆ విషపూరిత మూకను శాంతింపజేయడానికి మరుసటి రోజే రెహమాన్‌ను బలవంతంగా క్షమాపణలు చెప్పేలా చేశారు. దేశంలో విభజనవాదం పెరుగుతోందని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి?’ అంటూ వరుణ్ ప్రశ్నించారు. రెహమాన్ తనంతట తానుగా క్షమాపణ చెప్పలేదని, పరిస్థితుల ప్రభావంతో ఆయనను బలవంతం చేశారన్న కోణంలో వరుణ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. దీంతో సద్దుమనిగిందనుకున్న రచ్చ మలి మొదలైంది..

 

Exit mobile version