వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని దోంగతనం చేసి డబ్బులు కట్టినంత మాత్రాన కేసు ఉండకుండా ఉండదని టీడీపీ నేత, ఏపీఎస్ ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావు అన్నారు. బియ్యం దొంగతనం జరిగిందని పేర్ని నాని ఒప్పుకున్నారని, మాయమైన బియ్యానికి ఆయన సమాధానం చెప్పాలన్నారు. పేర్ని నాని కుటుంబ సభ్యులను కూటమి నేతలు దాచారనే ప్రచారం సరికాదని, పేర్ని నానిని దాయాల్సిన అవసరం తమకు లేదని నారాయణరావు పేర్కొన్నారు.
‘పేర్ని నాని దోంగతనం చేసి డబ్బులు కట్టినంత మాత్రాన కేసు ఉండకుండా ఉండదు. మాయమైన బియ్యానికి ఆయన సమాధానం చెప్పాలి. డబ్బులు కట్టినా కేసు నుంచి తప్పించుకోలేరు.బియ్యం వేరే వారికి అమ్మారు కాబట్టి కేసు పెడతారు, చర్యలు తీసుకుంటారు. బియ్యం దొంగతనం జరిగిందని పేర్ని నాని ఒప్పుకున్నారు. డబ్బులు కట్టినంత మాత్రాన క్షమిస్తారని అనుకోవద్దు. పేర్ని నాని కుటుంబ సభ్యులను కూటమి నేతలు దాచారనే ప్రచారం సరికాదు. పేర్ని నానిని దాయాల్సిన అవసరం మాకు లేదు.పేర్ని నాని ఎప్పుడు దొరుకుతాడా? అని ఎదురుచూస్తున్నాం. జోగి రమేష్ తో కలిసి కార్యక్రమంలో పాల్గొనటంపై చంద్రబాబును కలిసి వివరిస్తాను. దీనిపై నన్ను సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఎటువంటి వివరణ అడగలేదు. చంద్రబాబు హైదరాబాద్ నుంచి రాగానే కలుస్తాను. అనుకోకుండా కలిశామా, ఉద్దేశపూర్వకంగా కలిశామా అనేది అందరికీ తెలుస్తుంది’ అని ఏపీఎస్ ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావు చెప్పారు.
రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టించారని పేర్ని నాని తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. 32,00 బస్తాల రేషన్ బియ్యం తగ్గినట్టు అధికారులకు పేర్ని నాని లేఖ రాశారు. అధికారుల పరిశీలనలో 3,708 బస్తాలు తగ్గినట్టు తేలింది. రేషన్ బియ్యం తగ్గడంపై 2 దఫాలుగా రూ.1.70 కోట్లు పేర్ని నాని చెల్లించారు. ఈ నెల 13 రూ.కోటి, నిన్న రూ.70 లక్షల డీడీలు అందించారు. రేషన్ బియ్యం తగ్గుదలపై మరోసారి అధికారులు గోదాములలో విచారణ చేయనున్నారు. గోదాములు పేర్ని నాని భార్య జయసుధ పేరుతో ఉండటంతో పోలీసులు కేసు ఆమెపై కూడా కేసు నమోదు చేశారు.