NTV Telugu Site icon

Andhrapradesh: ఏపీలో రెండు యూనివర్సిటీలకు వీసీల నియామకం

Andhra University

Andhra University

Andhrapradesh: ఆంధ్రప్రదేశ్‌లోని రెండు వర్సిటీలకు వీసీలను నియమిస్తూ రాష్ట్ర గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ నోటిఫికేషన్లు జారీ చేశారు. ఆంధ్రా యూనివర్సిటీ నూతన వైస్ ఛాన్స్‌లర్‌గా ఆచార్య పీవీజీడీ ప్రసాద్ రెడ్డి నియామకమయ్యారు. ప్రసాద్ రెడ్డి నియామకాన్ని ఖరారు చేస్తూ గవర్నర్ ఉత్తర్వులు జారీ చేశారు. మూడేళ్ళ కాలపరిమితితో మరోసారి బాధ్యతలు చేపట్టనున్నారు ప్రసాద్ రెడ్డి. రాజకీయ ఆరోపణలు, పాలకమండలి గడువు ముగియడంతో గతంలో ప్రసాద్ రెడ్డిని ప్రభుత్వం కొనసాగించలేదు.

Read Also: CM YS Jagan: మేనల్లుడు రాజారెడ్డి ఎంగేజ్‌మెంట్‌కు హాజరుకానున్న సీఎం జగన్‌

కర్నూలులోని రాయలసీమ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్‌గా సుధీర్ ప్రేమ్‌ కుమార్ నియామకమయ్యారు. జేఎన్‌టీయూ (హైద్రాబాద్)లో మెకానికల్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్‌గా సుధీర్ కుమార్ ఉన్నారు. ఏపీ విశ్వవిద్యాలయాల చట్టం 1991 ప్రకారం ఆయనను నియమించినట్లు గవర్నర్ వెల్లడించారు. నియామకపు తేదీ నుంచి మూడేళ్ల కాలం పాటు వారు పదవిలో ఉంటారని గవర్నర్‌ నోటిఫికేషన్‌లో స్పష్టం చేశారు.