తెలంగాణలో బదిలీ చేసిన స్థానాల్లో అధికారులను నియమిస్తూ ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్పీలు, సీపీలు, కలెక్టర్లను నియమిస్తూ లిస్ట్ పంపింది. అందులో హైదరాబాద్ సీపీగా సందీప్ శాండిల్యాను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సందీప్ శాండిల్య 1993 ఐపీస్ బ్యాచ్ కి చెందిన అధికారి. గుంటూరులో మెదటి పోస్టింగ్ కాగా… నల్గొండ, ఆదిలాబాద్, కృష్ణా, సౌత్ జోన్ డీసీపీగా ఈయన పనిచేశారు. 2016 నుండి 2018 వరకు సైబారాబాద్ పోలీస్ కమిషనర్ గా విధులు నిర్వర్తించారు.
సీఐడి, ఇంటిలిజెంట్ సెక్యూరిటీ వింగ్, అడిషనల్ పోలీస్ కమిషనర్ క్రైమ్ డిపార్ట్మెంట్ లో సందీప్ శాండిల్య పనిచేశారు. అంతేకాకుండా.. జైళ్లశాఖ డీజీగా మూడు నెలల పాటు పనిచేశారు. ప్రస్తుతం సందీప్ శాండిల్య పోలీస్ అకాడమీ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు.
Read Also: Israel-Hamas War: భారీ ఆపరేషన్‌కి ఇజ్రాయిల్ సిద్ధం.. 24 గంటల్లో గాజా ఖాళీ చేయాలని వార్నింగ్..
ఇక.. రవాణా శాఖ ముఖ్య కార్యదర్శిగా వాణిప్రసాద్, ఎక్సైజ్, వాణిజ్య పన్నుల శాఖ ముఖ్యకార్యదర్శిగా సునీల్ శర్మ, ఎక్సైజ్ కమిషనర్‌గా జ్యోతి బుద్ధ ప్రకాశ్, వాణిజ్య పన్నులశాఖ కమిషనర్‌గా క్రిస్టినా పేర్లను ప్రకటించింది. రంగారెడ్డి కలెర్టర్‌గా భారతీ హోలీకేరీ, మేడ్చల్ కలెక్టర్‌గా గౌతం, యాదాద్రి కలెక్టర్‌గా హనుమంత్, నిర్మల్ కలెక్టర్‌గా ఆశిష్ సంగవాన్ ను నియమించింది.
Read Also: Bandla Ganesh: పవన్ మూడు పెళ్లిళ్లపై సీఎం జగన్ వ్యాఖ్యలు.. వీడియో రిలీజ్ చేసిన బండ్లన్న
ఇక సీపీల విషయానికొస్తే.. వరంగల్ కమిషనర్గా అంబర్ కిషోర్ ఝా, నిజామాబాద్ కమిషనర్గా కల్మేశ్వర్, సంగారెడ్డి ఎస్పీగా రూపేశ్, మహబూబ్ నగర్ ఎస్పీగా హర్షవర్థన్, భూపాలపల్లి ఎస్పీగా కిరణ్ ఖారే, కామారెడ్డి ఎస్పీగా సింధూశర్మ, నాగర్ కర్నూల్ ఎస్పీగా వైభవ్ రఘునాథ్, సూర్యాపేట ఎస్పీగా రాహూల్ హెగ్డే, మహబూబాబాద్ ఎస్పీగా పాటిల్ సంగ్రం సింగ్, జగిత్యాల ఎస్పీగా సన్‌ప్రీత్ సింగ్, నారాయణపేట ఎస్పీగా యోగేశ్ గౌతం, జోగులాంబ గద్వాల ఎస్పీగా రితీరాజ్ బదిలీ అయ్యారు.