NTV Telugu Site icon

Hyderabad: సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే కోసం నోడల్ ఆఫీసర్ల నియామకం..

Survey

Survey

హైదరాబాద్‌లో కుల గణన ప్రక్రియ కొనసాగుతుంది. ఎన్యూమరేటర్లు ఇంటింటికి వెళ్లి సర్వే చేస్తున్నారు. కాగా.. సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే సమర్థవంతంగా నిర్వహించేందుకు నోడల్ ఆఫీసర్లను నియమించింది ప్రభుత్వం. జీహెచ్ఎంసీ పరిధిలో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను సమర్ధవంతంగా నిర్వహించేందుకు జీహెచ్ఎంసీ సిద్ధమైంది. 30 సర్కిళ్లకు 10 మంది నోడల్ ఆఫీసర్లను నియమిస్తూ.. వారి కింద మూడు సర్కిళ్ల చొప్పున వీరికి బాధ్యతలను అప్పగించింది జీహెచ్ఎంసీ. సర్వే ప్రక్రియ మరింత పారదర్శకంగా నిర్వహించేందుకు జీహెచ్ఎంసీ ఈ నిర్ణయం తీసుకుంది.

Vikram Misri: విదేశాంగ కార్యదర్శి విక్రమ్‌ మిస్రీ పదవీకాలాన్ని పొడిగించిన కేంద్రం

నియమించిన వారిలో..
కాప్రా, మల్కాజ్‌గిరి, సికింద్రాబాద్ సర్కిళ్లకు అడిషనల్ కమిషనర్ ఎస్. సరోజ.
హయత్‌నగర్, ఎల్బీనగర్, సరూర్ నగర్ అడిషనల్ కమిషనర్ ఎస్. పంకజ.
సంతోష్ నగర్, చాంద్రాయణగుట్ట, ఫలక్‌నుమా సర్కిళ్లకు అడిషనల్ కమిషనర్ సామ్రాట్ అశోక్.
మలక్‌పేట, చార్మినార్, రాజేంద్రనగర్ సర్కిళ్లకు ఎస్టేట్ ఆఫీసర్ వై. శ్రీనివాస్ రెడ్డి.
మెహదీపట్నం, కార్వాన్, జూబ్లీహిల్స్ సర్కిళ్ళకి ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్ శరత్ చంద్ర.
గోషామహాల్, ముషీరాబాద్, అంబర్ పేట సర్కిళ్లకు లీగల్, ఎలక్ట్రిసిటీ అడిషనల్ కమిషనర్ సత్యనారాయణ.
యూసుఫ్ గూడ, శేరిలింగంపల్లి, చందానగర్ సర్కిళ్లకు చీఫ్ ఎగ్జామినర్ అకౌంట్స్ వెంకట్ రెడ్డి.
పటాన్ చెరు, మూసాపేట, కూకట్‌పల్లి సర్కిళ్లకు అదనపు కమిషనర్ (అడ్వర్‌టైజ్‌మెంట్స్) వేణుగోపాల్ రెడ్డి.
కుత్బుల్లాపూర్, గాజులరామారం సర్కిళ్లకు అడిషనల్ కమిషనర్ శానిటేషన్ సీఎన్ రఘు ప్రసాద్.
అల్వాల్, బేగంపేట, సికింద్రాబాద్, కంటోన్మెంట్, ఉప్పల్ సర్కిళ్ళకు నోడల్ అధికారిగా అడిషనల్ కమిషనర్ స్పోర్ట్స్ ఎన్. యాదగిరి రావును నియమించారు.

Deputy CM Pawan Kalyan: జనసేనలో చేరిన వైసీపీ కార్పొరేటర్లు.. డిప్యూటీ సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు

మరోవైపు.. జీహెచ్ఎంసీ పరిధిలో జరుగుతున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో ఇప్పటి వరకు 1,58,150 కుటుంబాలు సర్వే పూర్తి అయింది. జీహెచ్ఎంసీ పరిధిలో శనివారం మధ్యాహ్నం నుండి సర్వే ప్రారంభం కాగా.. మొదటి రోజు 12,912 కుటుంబాల సర్వే పూర్తి అయింది. ఆదివారం 69,624 కుటుంబాలు, మూడో రోజు (సోమవారం) జరిగిన సర్వేలో 88,516 కుటుంబాల సర్వే పూర్తయింది.