Site icon NTV Telugu

Andhra Pradesh: ఏపీలో పలు జిల్లాలకు కలెక్టర్లు, ఎస్పీలు నియామకం

Cec

Cec

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో మూడు జిల్లాలకు కలెక్టర్లు, ఐదు జిల్లాలకు ఎస్పీల నియామకం జరిగింది. ఇటీవల కొందరు జిల్లా ఎస్పీలు, కలెక్టర్లపై ఎన్నికల కమిషన్ బదిలీ వేటు వేసిన సంగతి తెలిసిందే. ముగ్గురు ఐఏఎస్‌లతోపాటు, 6గురు ఐపీఎస్‌ అధికారులను బదిలీ చేసింది. వారిలో ప్రకాశం జిల్లా ఎస్పీ పరమేశ్వర్‌రెడ్డి, పల్నాడు ఎస్పీ రవిశంకర్‌ రెడ్డి, చిత్తూరు ఎస్పీ జాషువా, అనంతపురం ఎస్పీ అన్బురాజన్‌, నెల్లూరు ఎస్పీ తిరుమలేశ్వర్‌రెడ్డి, గుంటూరు రేంజ్‌ ఐజీ పాలరాజు ఉన్న విషయం విదితమే. బదిలీ అయిన వారి స్థానంలో ఈసీ కొత్తగా నియామకాలు చేపట్టింది. ఈ మేరకు గురువారం ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా నియామకమైన వారి ఈ రోజు రాత్రి 8 గంటల వరకు విధుల్లో చేరాలని ఉత్తర్వులు జారీ చేసింది.

Read Also: Nallamilli Ramakrishna Reddy: మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లితో బీజేపీ నేతల మంతనాలు

కొత్తగా నియమితులైన పోలీసుల ఉన్నతాధికారులు వీరే..
ప్రకాశం ఎస్పీ సునీల్
పల్నాడు ఎస్పీ బింధు
చిత్తూరు ఎస్పీ మణికంఠ
అనంతపురం అమిత్ బర్ధార్
నెల్లూరు ఎస్పీ ఆరీఫ్
గుంటూరు రేంజ్ ఐజీగా సర్వశ్రేష్ట త్రిపాఠి

కలెక్టర్లు వీరే..
డీకే బాలాజీ – కృష్ణ
వినోద్ కుమార్ – అనంతపురం
ప్రవీణ్ కుమార్ – తిరుపతి

Exit mobile version