Apple మొట్టమొదటిసారిగా టచ్‌స్క్రీన్ సదుపాయం.. PROLED XDR డిస్ప్లే, M5 ప్రాసెసర్లతో MacBook Pro లాంచ్..
- యాపిల్ తొలి టచ్‌స్క్రీన్ మ్యాక్‌బుక్ ప్రో
- డిస్ప్లే: టెన్డం OLED PROLED XDR, 120Hz ప్రోమోషన్
- స్క్రీన్ సైజులు: 14 అంగుళాలు, 16 అంగుళాలు
- ప్రాసెసర్లు: M5 Pro, M5 Max..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Apple MacBook Pro: టెక్ దిగ్గజం యాపిల్ తన సరికొత్త ‘ప్రో అండ్ టెల్’ (Pro and Tell) ఈవెంట్లో MacBook Pro with PROLED XDR display మోడల్‌ను భారత మార్కెట్లో అధికారికంగా లాంచ్ చేసింది. యాపిల్ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా OLED డిస్ప్లే, టచ్‌స్క్రీన్ సదుపాయంతో రూపొందించిన ల్యాప్‌టాప్ ఇదే. 14, 16 అంగుళాల స్క్రీన్ సైజుల్లో లభించే ఈ ప్రీమియం ల్యాప్‌టాప్.. సరికొత్త M5 Pro, M5 Max చిప్సెట్లతో అత్యుత్తమ పనితీరును అందిచనుంది. ఐప్యాడ్ ప్రో తరహాలోనే ఇందులో టెన్డం OLED ప్యానెల్‌ను అమర్చారు. ఇది మల్టీ-టచ్ గెస్టర్లకు పూర్తి మద్దతు ఇస్తుంది.
డిస్ప్లే & ఐలాండ్ ఫీచర్లు
యాపిల్ తొలి టచ్‌స్క్రీన్ ల్యాప్‌టాప్ సరికొత్త macOS 27 గోల్డెన్ గేట్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఇందులో 16.3 అంగుళాల వరకు ఉండే టెన్డం OLED స్క్రీన్ కలదు. ఇది 3,472 x 2,266 పిక్సెల్స్ రిజల్యూషన్, 254 ppi పిక్సెల్ డెన్సిటీ, గరిష్టంగా 2,000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 1 బిలియన్ రంగులు, 10Hz నుంచి 120Hz వరకు మారే ప్రోమోషన్ (ProMotion) అడాప్టివ్ రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. ఐఫోన్లలో ప్రసిద్ధి చెందిన ‘డైనమిక్ ఐలాండ్’ (Dynamic Island) ఫీచర్‌ను మొదటిసారిగా ఈ మ్యాక్‌బుక్‌లో పరిచయం చేశారు.
Also Read
- Redmi Book 14 2027: Redmi కొత్త ల్యాప్‌టాప్‌లు వచ్చేశాయ్.. Intel Core 7 ప్రాసెసర్, 72Wh బ్యాటరీ, 120Hz డిస్ప్లే
- 6,100mAh బ్యాటరీ, కిరిన్ 8000S చిప్సెట్, AI సెక్యూరిటీ ఫీచర్లతో Huawei Enjoy 100 స్మార్ట్‌ఫోన్ లాంచ్..!
- iQOO Neo 12: 9000mAh బ్యాటరీ, 185Hz AMOLED డిస్ప్లేతో.. iQOO Neo 12 పవర్ఫుల్ గేమింగ్ ఫోన్ లాంచ్!
- 9,020 mAh బ్యాటరీ, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, 2.3K 165Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ iQOO Pad Pro లాంచ్..!
స్క్రీన్‌పై గీతలు పడకుండా ఉండేందుకు యాంటీ-రిఫ్లెక్టివ్, ఫింగర్‌ప్రింట్ రెసిస్టెంట్ కోటింగ్‌తో పాటు ఆప్షనల్ నానో-టెక్స్చర్ గ్లాస్ ఎంపికను అందించారు. వీడియో కాల్స్ కోసం సెంటర్ స్టేజ్ ఫీచర్‌తో కూడిన 12 MP వెబ్‌క్యామ్, టైపింగ్ కోసం బ్యాక్లిట్ మ్యాజిక్ కీబోర్డ్ ఇందులో ఉన్నాయి.
M5 Pro, M5 Max చిప్సెట్స్
ఈ మ్యాక్‌బుక్ ప్రో అత్యాధునిక 3nm ప్రాసెస్‌పై తయారైన M5 Pro, M5 Max ప్రాసెసర్లతో బాగా పనిచేస్తుంది. ఈ చిప్సెట్లు 18 కోర్ల CPUని కలిగి ఉన్నాయి. ఇందులో 12 పెర్ఫార్మెన్స్ కోర్లు సిస్టమ్ సమర్థతను పెంచగా, 6 హై-పెర్ఫార్మెన్స్ “సూపర్ కోర్లు” సింగిల్ థ్రెడ్ పనితీరును తారాస్థాయికి చేరుస్తాయి. గత తరం M4 ప్రో, M4 మ్యాక్స్ చిప్‌లతో పోలిస్తే.. ఇవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టాస్క్‌ల కోసం 4 రెట్లకు పైగా పీక్ GPU కంప్యూట్ సామర్థ్యాన్ని అందిస్తాయి.
కనెక్టివిటీ, ఆడియో
యాపిల్ సొంతంగా అభివృద్ధి చేసిన N1 నెట్వర్కింగ్ చిప్ ద్వారా ఇది నడుస్తుంది. దీనివల్ల అత్యాధునిక Wi-Fi 7, బ్లూటూత్ 6, థ్రెడ్ నెట్వర్కింగ్ టెక్నాలజీ లభిస్తాయి. ఆడియో ప్రియుల కోసం ఫోర్స్-క్యాన్సిలింగ్ వూఫర్లతో కూడిన ఆరు హై-ఫిడిలిటీ స్పీకర్లు, స్పేషియల్ ఆడియో సదుపాయం ఉన్నాయి. కనెక్టివిటీ కోసం మూడు థండర్‌బోల్ట్ 5 పోర్టులు, ఒక SDXC కార్డ్ స్లాట్, ఒక HDMI పోర్ట్, 3.5mm ఆడియో జాక్ మరియు మ్యాగ్‌సేఫ్ 3 (MagSafe 3) ఛార్జింగ్ పోర్ట్‌ను పొందుపరిచారు.
బ్యాటరీ లైఫ్
M5 ప్రో చిప్సెట్తో కూడిన 16.3 అంగుళాల మోడల్లో ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు 24 గంటల వీడియో స్ట్రీమింగ్ సమయాన్ని అందిస్తుంది, అలాగే 140W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. 14-అంగుళాల M5 ప్రో వేరియంట్ 22 గంటల వీడియో స్ట్రీమింగ్, 96W ఫాస్ట్ ఛార్జింగ్‌ను అందిస్తుంది. ఇక M5 మ్యాక్స్ ప్రాసెసర్ కలిగిన 14-అంగుళాల మోడల్ 20 గంటలు, 16-అంగుళాల మోడల్ 22 గంటల వీడియో స్ట్రీమింగ్ బ్యాకప్‌ను సమకూరుస్తాయి. 14-అంగుళాల మోడల్ బరువు సుమారు 1.4 కేజీలు ఉండగా, 16-అంగుళాల మోడల్ బరువు దాదాపు 1.84 కేజీలుగా ఉంది.
ధర
ఈ సరికొత్త మ్యాక్‌బుక్ ప్రో మోడల్స్ సిల్వర్ (Silver), స్పేస్ బ్లాక్ (Space Black) రంగుల్లో లభిస్తాయి. నవంబర్ 9 నుండి యాపిల్ ఇండియా ఆన్లైన్ స్టోర్ ద్వారా అమ్మకాలు ప్రారంభం కానున్నాయి.
* M5 Pro 14-అంగుళాల మోడల్: ప్రారంభ ధర రూ. 3,49,900 (ఎడ్యుకేషన్ ఆఫర్ కింద రూ. 3,31,900).
* M5 Pro 16-అంగుళాల మోడల్: ప్రారంభ ధర రూ. 4,09,900 (ఎడ్యుకేషన్ ఆఫర్ కింద రూ. 3,85,900).
* M5 Max 14-అంగుళాల మోడల్: ప్రారంభ ధర రూ. 5,49,900 (ఎడ్యుకేషన్ ఆఫర్ కింద రూ. 5,12,900).
* M5 Max 16-అంగుళాల టాప్-ఎండ్ మోడల్: ప్రారంభ ధర రూ. 5,89,900 (ఎడ్యుకేషన్ ఆఫర్ కింద రూ. 5,52,900).
తాజావార్తలు
-
Redmi Book 14 2027: Redmi కొత్త ల్యాప్‌టాప్‌లు వచ్చేశాయ్.. Intel Core 7 ప్రాసెసర్, 72Wh బ్యాటరీ, 120Hz డిస్ప్లే
-
Sai Pallavi: “రావణుడు పూర్తిగా చెడ్డవాడు కాదు”.. లాస్ ఎంజెల్స్ వేదికగా సాయి పల్లవి సంచలన వ్యాఖ్యలు..
-
West Asia Crisis: పశ్చిమాసియాలో భారతీయుల భద్రతపై ఆందోళన.. 22 మంది మృతి చెందినట్లు విదేశాంగ శాఖ వెల్లడి
-
WPL Auction 2027: చాలా తక్కువ ధరకే స్టార్ ప్లేయర్లు.. ముంబై ఇండియన్స్ భలే లక్కీ.. ఫుల్ స్క్వాడ్ ఇదే!
-
6,100mAh బ్యాటరీ, కిరిన్ 8000S చిప్సెట్, AI సెక్యూరిటీ ఫీచర్లతో Huawei Enjoy 100 స్మార్ట్‌ఫోన్ లాంచ్..!
ట్రెండింగ్
-
Apple మొట్టమొదటిసారిగా టచ్‌స్క్రీన్ సదుపాయం.. PROLED XDR డిస్ప్లే, M5 ప్రాసెసర్లతో MacBook Pro లాంచ్..
-
Less Oil Cooking: తక్కువ నూనెతో రుచికరమైన వంటలు.. అడుగు అంటకుండా ఉండే స్మార్ట్ చిట్కాలు ఇవే..
-
9,020 mAh బ్యాటరీ, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, 2.3K 165Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ iQOO Pad Pro లాంచ్..!
-
Viral Food : ఎగ్ టార్ట్పై బొద్దింకలాంటి పురుగు.. తినేందుకు ఎగబడుతున్న జనం.!
-
Dhanteras 2026: ధనత్రయోదశి 2026.. మీ రాశి ప్రకారం ఏ వస్తువు కొనాలి.?