NTV Telugu Site icon

iPhone 16e: ఆపిల్ కొత్త ఐఫోన్ విడుదల.. స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు, ధర వివరాలు ఇలా

Iphone 16e

Iphone 16e

iPhone 16e: ఆపిల్‌ నుంచి కొత్త ఐఫోన్‌ రాబోతోందని అనేక రోజులుగా లీకులు వచ్చాయి. మొదటగా ఈ ఫోన్‌ను ఐఫోన్ SE 4గా విడుదల చేస్తారని ఊహాగానాలు వెల్లువెత్తాయి. అయితే ఆపిల్‌ అన్ని ప్రచారాలకు తెరదించుతూ, ఐఫోన్‌ 16e పేరుతో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసింది. ఈ ఫోన్‌ ఆపిల్ ఇంటెలిజెన్స్‌ను సపోర్ట్‌ చేయడంతోపాటు, మెరుగైన ప్రదర్శనను అందించనుందని కంపెనీ తెలిపింది. ఇక ఈ ఐఫోన్‌ 16e స్పెసిఫికేషన్‌లు, ఫీచర్ల విషయానికి వస్తే..

* డిస్‌ప్లే:

– 6.1 అంగుళాల సూపర్ రెటీనా XDR OLED డిస్‌ప్లే
– 1170 × 2532 పిక్సెల్‌ రిజల్యూషన్
– 60Hz రీఫ్రెష్ రేట్‌
– 800 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్
– సిరామిక్ షీల్డ్ రక్షణ.

* ప్రాసెసర్ & సాఫ్ట్‌వేర్:

– 3nm A18 చిప్‌సెట్‌
– iOS 18 ఆపరేటింగ్ సిస్టమ్
– 8GB ర్యామ్ (ఆపిల్ అధికారికంగా ప్రకటించలేదు)

* 128GB, 256GB, 512GB స్టోరేజీ వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి.

* కెమెరా:
– వెనుక వైపు 48MP కెమెరా (OIS సపోర్ట్‌తో)
– సెల్ఫీ & వీడియో కాల్స్ కోసం 12MP ఫ్రంట్ కెమెరా
– ఫేస్ ID సపోర్ట్

* బ్యాటరీ & ఛార్జింగ్:

– 18W వైర్‌డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌
– 7.5W వైర్‌లెస్ ఛార్జింగ్‌
– USB-C ఛార్జింగ్ పోర్ట్

* కనెక్టివిటీ & ఇతర ఫీచర్లు:

– 5G, 4G LTE, Wi-Fi, బ్లూటూత్‌, GPS, NFC
– IP68 రేటింగ్ (డస్ట్‌ & వాటర్ రెసిస్టెంట్‌)
– స్టీరియో స్పీకర్లు
– డ్యూయల్ సిమ్ (నానో + eSIM)

ధర:
128GB వేరియంట్ – రూ.59,900
256GB వేరియంట్ – రూ.69,900
512GB వేరియంట్ – రూ.89,900

ఇక ఈ మొబైల్స్ ఫిబ్రవరి 21 నుంచి ముందస్తు బుకింగ్‌లు ప్రారంభం కానుండగా, ఫిబ్రవరి 28 నుంచి సేల్‌ మొదలవుతుంది. ఈ ఫోన్‌ ప్రస్తుతం తెలుపు, నలుపు రంగుల్లో మాత్రమే అందుబాటులో ఉంది. మొత్తంగా ఈ ఐఫోన్ 16e ఆపిల్‌ అభిమానులను ఆకట్టుకునే ఫీచర్‌లను అందిస్తోంది. ముఖ్యంగా, ఆపిల్ ఇంటెలిజెన్స్, అధునాతన ప్రాసెసర్, మెరుగైన కెమెరా పనితీరు, స్టాండర్డ్ డిజైన్‌తో మార్కెట్లో వినియోగదారులను ఆకర్షించే అవకాశం ఉంది.