Samsung Roasts Apple’s First Foldable: యాపిల్ ఫోల్డబుల్‌పై శామ్సంగ్ ఘాటు సెటైర్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Samsung Roasts Apple’s First Foldable: ఫోల్డబుల్ ఫోన్లు ఎప్పటి నుంచో మార్కెట్లో ఉన్నారు.. యాపిల్ ఆలస్యంగా ఎట్టకేలకు ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ విభాగంలోకి అడుగుపెట్టింది. iPhone Duo పేరుతో తన తొలి ఫోల్డబుల్ ఫోన్‌ను పరిచయం చేసింది. అయితే ఈ లాంచ్‌పై యాపిల్ ప్రత్యర్థి.. ఇప్పటికే ఫోల్డబుల్ ఫోన్లు తీసుకొచ్చిన శామ్సంగ్ వెంటనే సెటైర్లు వేసింది. ఎన్నో ఏళ్లుగా ఆండ్రాయిడ్ కంపెనీలు ఫోల్డబుల్ ఫోన్లను అభివృద్ధి చేస్తున్న నేపథ్యంలో.. యాపిల్ చాలా ఆలస్యంగా ఈ మార్కెట్లోకి వచ్చిందంటూ శామ్సంగ్ తన సోషల్ మీడియా పోస్టుల ద్వారా ఎద్దేవా చేసింది.
యాపిల్ లాంచ్ ఈవెంట్ జరుగుతున్న సమయంలో శామ్సంగ్ అమెరికా సోషల్ మీడియా టీమ్ వరుస పోస్టులు చేసింది. అందులో “మా మిగిల్చినదే మళ్లీ వేడిచేయడం పూర్తయ్యాక మాకు చెప్పండి” అంటూ చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. మరో పోస్టులో “ఇది చాలా పరిచయంగా అనిపిస్తోంది. ఇది సిమ్స్ సీక్వెలా?” అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించింది. “మమ్మల్ని వేచి ఉండమంటారా? ఫర్వాలేదు.. మేము మూడు విధాలుగా ఫోల్డ్ చేస్తూ ఉంటాం” అంటూ శామ్సంగ్ మరో పోస్టు చేసింది. తద్వారా యాపిల్ తొలి ఫోల్డబుల్‌ను విడుదల చేస్తుండగా, ఇతర కంపెనీలు ఇప్పటికే ట్రై-ఫోల్డ్ డిస్ప్లేలు వంటి అధునాతన డిజైన్లకు వెళ్లిపోయాయని గుర్తుచేసింది. యాక్సెసరీస్ విషయంలోనూ యాపిల్‌పై శామ్సంగ్ సెటైర్లు వేసింది.
Also Read
- CII Summit: విశాఖ సీఐఐ సమ్మిట్‌లో సందడి.. పారిశ్రామికవేత్తల ఆవిష్కరణలను పరిశీలించిన మంత్రి శ్రీనివాస్..
- IPL 2028: ఐపీఎల్ 2028లో 12 జట్లు..? క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ..
- Team India Squad: నవంబర్ 30 నుంచి ఇంగ్లాండ్‌తో సమరం.. జట్టు ప్రకటన..
- Ball Tampering: ఆస్ట్రేలియా క్రికెట్లో మళ్లీ బాల్ ట్యాంపరింగ్ దుమారం.. నిషేధం తప్పదా..?
ఫోల్డబుల్ రంగంలో శామ్సంగ్కు ఏడేళ్ల అనుభవం
ఫోల్డబుల్ ఫోన్ మార్కెట్లో శామ్సంగ్కు గణనీయమైన ముందంజ ఉంది. 2019లోనే కంపెనీ తొలి Galaxy Foldను విడుదల చేసింది. గత ఏడేళ్లలో శామ్సంగ్తో పాటు గూగుల్, మోటరోలా వంటి సంస్థలు ఫోల్డబుల్ ఫోన్లకు అనేక తరాలను తీసుకొచ్చాయి. ఈ క్రమంలో డిస్ప్లే క్రీజ్, సున్నితమైన హింజ్‌లు, అధిక బరువు వంటి ప్రారంభ సమస్యలను కూడా క్రమంగా పరిష్కరించాయి.
$1,999 ధరతో యాపిల్ తొలి ఫోల్డబుల్
ప్రత్యర్థుల సెటైర్లను పట్టించుకోకుండా యాపిల్ మాత్రం తన తొలి ఫోల్డబుల్ ఫోన్ మెరుగైన యూజర్ ఎక్స్పీరియన్స్ అందిస్తుందని నమ్ముతోంది. $1,999 ధర కలిగిన iPhone Duoలో అధునాతన డిజైన్‌తో పాటు డేటా ప్రైవసీపై యాపిల్ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ఈ అంశాలు ప్రత్యర్థి ఫోన్లపై తమకు ఆధిక్యం తెచ్చిపెడతాయని కంపెనీ భావిస్తోంది. iPhone Duoలో రౌండెడ్ ఎడ్జ్‌లు ఉండగా, ఫోన్‌ను తెరిచినప్పుడు 7.6 అంగుళాల డయాగనల్ స్క్రీన్ లభిస్తుంది. దీన్ని క్షితిజ సమాంతరంగానూ, నిలువుగానూ ఉపయోగించుకోవచ్చు. ఫోన్ మడిచినప్పుడు ముందు భాగంలో చిన్న సింగిల్ స్క్రీన్ ఉంటుంది. తెరిచినప్పుడు ఇది యాపిల్ రూపొందించిన అత్యంత పలుచని ఫోన్‌గా కంపెనీ పేర్కొంది. అయితే చైనీస్ కంపెనీలు అందిస్తున్న కొన్ని ఫోల్డబుల్ ఫోన్లతో పోలిస్తే iPhone Duo మందంగా ఉందని సమాచారం.
Was there range? No.
Was it exciting? No.
Did it happen? Yes.#ItsTimeToSwitch— Samsung Mobile US (@SamsungMobileUS) September 9, 2026
I'm so sorry, @DuoLingo. They copied us too #Solidarity
— Samsung Mobile US (@SamsungMobileUS) September 9, 2026
తాజావార్తలు
-
CII Summit: విశాఖ సీఐఐ సమ్మిట్‌లో సందడి.. పారిశ్రామికవేత్తల ఆవిష్కరణలను పరిశీలించిన మంత్రి శ్రీనివాస్..
-
IPL 2028: ఐపీఎల్ 2028లో 12 జట్లు..? క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ..
-
Team India Squad: నవంబర్ 30 నుంచి ఇంగ్లాండ్‌తో సమరం.. జట్టు ప్రకటన..
-
Ball Tampering: ఆస్ట్రేలియా క్రికెట్లో మళ్లీ బాల్ ట్యాంపరింగ్ దుమారం.. నిషేధం తప్పదా..?
-
Ramayana Box Office: ‘రామాయణ’ సేఫ్ జోన్లోకి వెళ్లాలంటే ఇంకా ఎన్ని కోట్లు కావాలి?
ట్రెండింగ్
-
iPhoneకు పోటీగా Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. Motorola Razr Flex పేరుతో రంగం సిద్ధం..!
-
Captain Sanju Samson: పుట్టినరోజున కెప్టెన్‌గా సంజూ శాంసన్‌కు ప్రమోషన్..
-
Egg Lababdar Recipe: ఎగ్ లవర్స్ కోసం పర్ఫెక్ట్ డిష్.. రెస్టారెంట్ స్టైల్ సూపర్ టేస్టీ “ఎగ్ లబాబ్దార్” సులువుగా చేసుకోండి ఇలా..!
-
How to Make Hara Saag: పప్పు తిని విసుగొచ్చిందా? తాజా ఆకుకూరలతో వింటర్ స్పెషల్ డిష్ ట్రై చేయండి..
-
IPL 2027 Trade: పంజాబ్ కింగ్స్‌కు హార్థిక్ పాండ్యా.. ముంబైకి ఆర్షదీప్ సింగ్.. ఇట్స్ అఫీషియల్..!