Apple: ఇటీవల కాలంలో ఐఫోన్‌కు ఉన్న క్రేజ్ వేరే లెవల్.. ఐ ఫోన్ ఉందంటే అదో ప్రస్టేజ్‌గా ఫీలవుతారు. అలాంటి ఐ ఫోన్ సంస్థ నిత్యం ఏదో ఒక వివాదాల్లో ఉంటోంది. తాజాగా ఐఫోన్ ను చార్జర్ లేకుండా అమ్మినందుకు ఆ సంస్థకు బ్రెజిల్ లోని ఓ సివిల్ కోర్ట్ రూ.164కోట్ల జరిమానా విధించింది. వినియోగదారులను తప్పుదోవ పట్టించే ప్రకటనలతో విక్రయాలు జరుపుతున్నందున్న వాటిని కొట్టేస్తూ కోర్టు జరిమానా వేసింది.
ఐఫోన్ విక్రయాల్లో చార్జర్ సమస్య కొంత కాలంగా యాపిల్‌కు ఎదురవుతోంది. ఈ సమస్య పరిష్కారం కోసం పర్యావరణ హితం పేరిట చార్జర్లు లేకుండా కేవలం చార్జింగ్ కేబుల్ ఇస్తూ కొన్ని దేశాల్లో యాపిల్ తన ఐఫోన్లను విక్రయిస్తోంది. ఈ తరహా వ్యవహారంపై ఇప్పటికే అభ్యంతరం వ్యక్తం చేసిన బ్రెజిల్ న్యాయశాఖ యాపిల్‌కు 2 మిలియన్ డాలర్ల జరిమానా విధించింది. ఈ ఆదేశాలను అంతగా పట్టించుకోని యాపిల్ తాజాగా బ్రెజిల్‌లో చార్జర్ లేకుండానే ఐఫోన్‌ను విక్రయించింది. దీనిపై విచారణ చేపట్టిన బ్రెజిల్ నగరం సావో పోలోలోని సివిల్ కోర్టు ఆ సంస్థకు 20 మిలియన్ డాలర్ల జరిమానా విధించింది.
Read Also: Kerala: అదృష్టం అంటే ఈ చేపల వ్యాపారిదే.. బ్యాంకు నోటీసులు, అంతలోనే తగిలిన లాటరీ
బ్రెజిల్‌లో ఐఫోన్లు అమ్మకాలు జరపాలంటే స్మార్ట్‌ఫోన్‌తో పాటు విధిగా చార్జర్ అందించాలని స్పష్టం చేసింది. చార్జర్ లేకుండానే యాపిల్ తన ప్రీమియం డివైజ్‌లను విక్రయిస్తోందని వినియోగదారులు, పన్నుచెల్లింపుదారులతో కూడిన అసోసియేషన్ పిటిషన్ ను దాఖలు చేసింది. దానిని విచారిస్తూ సా పాలో స్టేట్ కోర్టు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ నిర్ణయంపై గత ఉత్తర్వుల తరహాలోనే మరోసారి అప్పీల్‌కు వెళతామని యాపిల్ పేర్కొంది.
Read Also: Asaduddin Owaisi: హిజాబ్ ధరించిన ముస్లిం మహిళ భారతదేశానికి ప్రధాన మంత్రి అవుతుంది.
చార్జర్‌ను కూడా ఆఫర్ చేసే వరకూ కంపెనీని బ్రెజిల్‌లో ఐఫోన్లు విక్రయించకుండా నిషేధించారు. ఇదిలా ఉంటే కర్బన ఉద్గారాలను తగ్గించే చర్యల్లో భాగంగానే చార్జర్‌ను ఫోన్ తో పాటు ఇవ్వడం లేదని యాపిల్ చెబుతోంది. చార్జర్ లేకుండా స్మార్ట్‌ఫోన్ల విక్రయం వల్ల పర్యావరణానికి మేలు జరుగుతుందని చెప్పేందుకు ఎలాంటి ఆధారాలు లేవని బ్రెజిల్ అధికారులు యాపిల్ వాదనను తోసిపుచ్చారు. ఫోన్ చార్జింగ్‌కు అడాప్టర్ అవసరమని, ఇది లేకుండా స్మార్ట్‌ఫోన్ పనిచేయదని యాపిల్ ఛార్జర్ ఇవ్వకపోవడం వల్ల దానికి అనదనంగా డబ్బు చెల్లించాల్సి వస్తుందని అధికారులు అన్నారు. ఈ వాదనను పరిగణనలోకి తీసుకున్న కోర్టు చార్జర్‌ను కూడా రిటైల్ బాక్స్‌లో పొందుపరచి విక్రయాలు జరపాలని యాపిల్‌ను ఆదేశించింది. అంతేకాకుండా గడచిన రెండేళ్లలో ఐఫోన్ 12, 13 ఫోన్లను కొన్న వినియోగదారులందరికీ చార్జర్లను సరఫరా చేయాలని కూడా యాపిల్‌కు ఆదేశాలు జారీ చేసింది.
