Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Apple Fined Rs 164 Crore For Selling Iphones In Brazil Without A Charger

Apple: చార్జర్ లేకుండా ఫోన్ అమ్మినందుకు యాపిల్‌ సంస్థకు రూ. 164కోట్ల జరిమానా

Published Date :October 14, 2022 , 6:35 pm
By Rakesh Reddy
Apple: చార్జర్ లేకుండా ఫోన్ అమ్మినందుకు యాపిల్‌ సంస్థకు రూ. 164కోట్ల జరిమానా
  • Follow Us :
  • google news
  • dailyhunt

Apple: ఇటీవల కాలంలో ఐఫోన్‎కు ఉన్న క్రేజ్ వేరే లెవల్.. ఐ ఫోన్ ఉందంటే అదో ప్రస్టేజ్‎గా ఫీలవుతారు. అలాంటి ఐ ఫోన్ సంస్థ నిత్యం ఏదో ఒక వివాదాల్లో ఉంటోంది. తాజాగా ఐఫోన్ ను చార్జర్ లేకుండా అమ్మినందుకు ఆ సంస్థకు బ్రెజిల్ లోని ఓ సివిల్ కోర్ట్ రూ.164కోట్ల జరిమానా విధించింది. వినియోగదారులను తప్పుదోవ పట్టించే ప్రకటనలతో విక్రయాలు జరుపుతున్నందున్న వాటిని కొట్టేస్తూ కోర్టు జరిమానా వేసింది.

ఐఫోన్ విక్రయాల్లో చార్జర్ సమస్య కొంత కాలంగా యాపిల్‎కు ఎదురవుతోంది. ఈ స‌మ‌స్య ప‌రిష్కారం కోసం ప‌ర్యావ‌ర‌ణ హితం పేరిట చార్జర్లు లేకుండా కేవ‌లం చార్జింగ్ కేబుల్ ఇస్తూ కొన్ని దేశాల్లో యాపిల్ త‌న ఐఫోన్లను విక్రయిస్తోంది. ఈ త‌ర‌హా వ్యవ‌హారంపై ఇప్పటికే అభ్యంత‌రం వ్యక్తం చేసిన బ్రెజిల్ న్యాయ‌శాఖ యాపిల్‌కు 2 మిలియ‌న్ డాల‌ర్ల జ‌రిమానా విధించింది. ఈ ఆదేశాల‌ను అంత‌గా ప‌ట్టించుకోని యాపిల్ తాజాగా బ్రెజిల్‌లో చార్జర్ లేకుండానే ఐఫోన్‌ను విక్రయించింది. దీనిపై విచార‌ణ చేప‌ట్టిన బ్రెజిల్ న‌గ‌రం సావో పోలోలోని సివిల్ కోర్టు ఆ సంస్థకు 20 మిలియ‌న్ డాల‌ర్ల జ‌రిమానా విధించింది.

Read Also: Kerala: అదృష్టం అంటే ఈ చేపల వ్యాపారిదే.. బ్యాంకు నోటీసులు, అంతలోనే తగిలిన లాటరీ

బ్రెజిల్‌లో ఐఫోన్లు అమ్మకాలు జరపాలంటే స్మార్ట్‌ఫోన్‌తో పాటు విధిగా చార్జర్‌ అందించాలని స్పష్టం చేసింది. చార్జర్‌ లేకుండానే యాపిల్‌ తన ప్రీమియం డివైజ్‌లను విక్రయిస్తోందని వినియోగదారులు, పన్నుచెల్లింపుదారులతో కూడిన అసోసియేషన్‌ పిటిషన్‌ ను దాఖలు చేసింది. దానిని విచారిస్తూ సా పాలో స్టేట్‌ కోర్టు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ నిర్ణయంపై గత ఉత్తర్వుల తరహాలోనే మరోసారి అప్పీల్‌కు వెళతామని యాపిల్‌ పేర్కొంది.

Read Also: Asaduddin Owaisi: హిజాబ్ ధరించిన ముస్లిం మహిళ భారతదేశానికి ప్రధాన మంత్రి అవుతుంది.

చార్జర్‌ను కూడా ఆఫర్‌ చేసే వరకూ కంపెనీని బ్రెజిల్‌లో ఐఫోన్లు విక్రయించకుండా నిషేధించారు. ఇదిలా ఉంటే కర్బన ఉద్గారాలను తగ్గించే చర్యల్లో భాగంగానే చార్జర్‌ను ఫోన్ తో పాటు ఇవ్వడం లేదని యాపిల్‌ చెబుతోంది. చార్జర్‌ లేకుండా స్మార్ట్‌ఫోన్ల విక్రయం వల్ల పర్యావరణానికి మేలు జరుగుతుందని చెప్పేందుకు ఎలాంటి ఆధారాలు లేవని బ్రెజిల్‌ అధికారులు యాపిల్‌ వాదనను తోసిపుచ్చారు. ఫోన్‌ చార్జింగ్‌కు అడాప్టర్‌ అవసరమని, ఇది లేకుండా స్మార్ట్‌ఫోన్‌ పనిచేయదని యాపిల్ ఛార్జర్ ఇవ్వకపోవడం వల్ల దానికి అనదనంగా డబ్బు చెల్లించాల్సి వస్తుందని అధికారులు అన్నారు. ఈ వాదనను పరిగణనలోకి తీసుకున్న కోర్టు చార్జర్‌ను కూడా రిటైల్‌ బాక్స్‌లో పొందుపరచి విక్రయాలు జరపాలని యాపిల్‌ను ఆదేశించింది. అంతేకాకుండా గ‌డ‌చిన రెండేళ్లలో ఐఫోన్ 12, 13 ఫోన్లను కొన్న వినియోగ‌దారులంద‌రికీ చార్జర్లను స‌ర‌ఫ‌రా చేయాల‌ని కూడా యాపిల్‌కు ఆదేశాలు జారీ చేసింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Apple
  • Brazil
  • Charger
  • FINE
  • iphone

తాజావార్తలు

  • Mukul Chaudhary: తండ్రి పెళ్లి కాకముందే కన్న కల.. నేడు ఐపీఎల్‌లో నిజం చేసిన కొడుకు.. ముకుల్ ఎమోషనల్ జర్నీ!

  • What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

  • KKR vs LSG: 27 బంతుల్లో 7 సిక్సర్లు.. ఓటమి అంచు నుంచి లక్నోను గెలిపించిన ముకుల్ చౌదరి ఎవరు!

  • Astrology: ఏప్రిల్‌ 10, శుక్రవారం దినఫలాలు.. ఈ రాశివారికి శుభవార్త..

  • Royal Enfield: రాయల్ ఎన్‌ఫీల్డ్ మొదటి ఎలక్ట్రిక్ బైక్ వచ్చేసింది.. ధర ఎంతో తెలుసా.?

ట్రెండింగ్‌

  • Rare Fish: వలకు చిక్కిన అరుదైన చేప.. ఆనందంలో మత్స్యకారుడు.. ఎగబడిన జనం..

  • Jamun Seed Powder : ఆ కాలంలో షుగర్‌ కంట్రోల్‌కు నేరేడు గింజల పొడి వాడేవారు.. తయారీ విధానం ఇలా..!

  • TCS ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుండి జీతాల పెంపు.!

  • Ai+ నుంచి కొత్త గాడ్జెట్ల వర్షం.. PulseTab ట్యాబ్, NovaPods, RotateCam స్మార్ట్‌వాచ్ లాంచ్..!

  • బడ్జెట్, మిడ్‌రేంజ్, ప్రీమియం.. Nova 2 5G, Ultra, Flip మోడళ్లతో Ai+ ఎంట్రీ..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions