Apollo Hospitals: అపోలో హాస్పిటల్స్ ఎంటర్‌ప్రైజ్ దేశంలోనే పేర్గాంచిన ప్రసిద్ధ హాస్పిటల్ నెట్‌వర్క్. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఓ వ్యాపార కుటుంబం దీన్ని నడుపుతోంది. పైగా ఇది గ్లోబల్ స్టార్ హీరో రామ్ చరణ్ భార్య ఉపాసన కుటుంబానికి చెందిన కంపెనీ. అపోలో హాస్పిటల్స్ తన నాలుగో త్రైమాసిక ఆర్థిక ఫలితాలను ఇటీవల విడుదల చేసింది. గత త్రైమాసికంలో కంపెనీ రూ.146 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. గత ఏడాది ఇదే కాలంలో కంపెనీ ఆర్జించిన రూ.97 కోట్ల లాభంతో పోలిస్తే ఇది 50.5 శాతం ఎక్కువ. అయితే, మార్కెట్ విశ్లేషకుల అంచనా ప్రకారం రూ.198 కోట్లను అందుకోవడంలో ఆసుపత్రి సంస్థ విఫలమైంది. దీంతో ఇన్వెస్టర్లు కొంత నిరాశకు గురయ్యారు.
Read Also:Khalistan: CBSC సిలబస్ నుంచి “సపరేట్ సిక్కు దేశం” పాఠ్యాంశం తొలగింపు
మెరుగైన ఆక్యుపెన్సీ బలమైన లాభాలను నమోదు చేయడానికి దోహదపడింది. త్రైమాసికంలో ఆదాయం 21.3 శాతం పెరిగి రూ.4,302.2 కోట్లకు చేరుకుంది. ఇది రూ.4,302.7 కోట్ల అంచనాలకు అనుగుణంగా ఉంది. గతేడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ ఆదాయం కేవలం రూ.3,546.4 కోట్లు. కానీ అపోలో హెల్త్ కో వ్యాపారం వైపు చేసిన పెట్టుబడుల కారణంగా నిర్వహణ పనితీరు ఇప్పటికీ ఒత్తిడిలో ఉంది. మునుపటి త్రైమాసికంలో, అపోలో మేనేజ్‌మెంట్ తన హెల్త్‌కో ఆర్మ్‌లో నష్టాలు Q4లో గరిష్ట స్థాయికి చేరుకున్నాయని, FY24 ద్వితీయార్ధంలో బ్రేక్‌ఈవెన్‌ను ఆశించినందున కోలుకునే మార్గంలో ఉందని పేర్కొంది. నాల్గవ త్రైమాసికంలో డిజిటల్ ఆర్మ్ నష్టాలు పెరగడంతో, విశ్లేషకులు, పెట్టుబడిదారులు డిజిటల్ వ్యాపారం, ఆసుపత్రి విభాగానికి సంబంధించిన ఔట్‌లుక్‌పై మేనేజ్‌మెంట్ వ్యాఖ్యల కోసం ఎదురు చూస్తున్నారు. వచ్చే 6 నెలల్లో అపోలో హెల్త్‌కేర్ ద్వారా వచ్చే నష్టాలను పూడ్చేందుకు అంతర్గత వనరుల నుంచి నిధులను సమీకరించనున్నట్లు కంపెనీ వెల్లడించింది. దీని ప్రకారం వచ్చే త్రైమాసికాల్లోనూ మార్జిన్లపై ఒత్తిడి కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి ఎన్‌ఎస్‌ఈలో అపోలో హాస్పిటల్స్ కంపెనీ షేరు రూ.4,600 వద్ద ముగిసింది.
Read Also:Telangana Police: తెలంగాణలో ఎస్ఐ, కానిస్టేబుల్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ రిలీజ్