APL-5లో కాకినాడ కింగ్స్ శుభారంభం.. 71 పరుగుల తేడాతో వైజాగ్ లయన్స్‌పై భారీ విజయం.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
APL 2026: ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అభిమానులను అలరించేందుకు ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (APL) 5వ సీజన్ విశాఖపట్నంలో ప్రారంభమైంది. విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఇటీవల జరిగిన అగ్నిప్రమాదం నేపథ్యంలో ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా టోర్నీని ప్రారంభించారు. స్థానిక ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు టోర్నీకి శ్రీకారం చుట్టారు.
విశాఖపట్నంలోని ఏసీఏ-వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన తొలి మ్యాచ్‌లో కాకినాడ కింగ్స్ జట్టు సింహాద్రి వైజాగ్ లయన్స్‌పై 71 పరుగుల భారీ తేడాతో భారీ విజయం సాధించింది. బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లోనూ పూర్తి ఆధిపత్యం చెలాయించిన కాకినాడ కింగ్స్ సీజన్‌ను విజయంతో ఆరంభించింది.
Also Read
- Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
- NASA: అంగారక గ్రహంపై ఏలియన్ 'జెల్లీఫిష్' కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
- Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
- T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్‌కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన కాకినాడ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 219 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. యువన్ సిక్సర్లతో అలరిస్తూ అర్ధశతకంతో అజేయంగా నిలిచి జట్టుకు భారీ స్కోరును అందించాడు. అతనికి తోడుగా అభిషేక్, అర్జున్, తపస్వి, మనీష్, లక్షజ్ రెడ్డి వేగంగా పరుగులు సాధించడంతో జట్టు స్కోరును పరుగులు పెట్టించారు. ఇక 220 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సింహాద్రి వైజాగ్ లయన్స్‌కు ఆరంభం నుంచే ఎదురుదెబ్బలు తగిలాయి. కాకినాడ బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్‌కు లయన్స్ బ్యాటర్లు నిలువలేకపోయారు. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయిన జట్టు 18.4 ఓవర్లలో 148 పరుగులకే ఆలౌట్ అయింది.
కాకినాడ బౌలర్లలో ఆంజనేయులు మూడు వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. మరోవైపు అద్భుత అర్ధశతకంతో మ్యాచ్ ఫలితాన్ని మలుపుతిప్పిన యువన్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
తాజావార్తలు
-
Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
-
NASA: అంగారక గ్రహంపై ఏలియన్ ‘జెల్లీఫిష్’ కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
-
Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
-
Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్‌లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
-
T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్‌కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్‌లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!