NTV Telugu Site icon

Gidugu Rudra Raju: అధికార, ప్రతిపక్ష నేతల మధ్య దాయాదుల పోరు కొనసాగుతోంది..

Gidugu

Gidugu

జాతీయ స్థాయిలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఆధ్వర్యంలో ఓబీసీ జనగనంపై ప్రత్యేక సమావేశం కొనసాగిందని గిడుగు రుద్రరాజు అన్నారు. ఓబీసీ కుల గణనపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రత్యేక దృష్టి సారించింది.. ఓబీసీ అభివృద్ధి దేశవ్యాప్తంగా కుంటుపడిందనటంలో ఎలాంటి సందేహం లేదు.. సమాజంలో రిజర్వేషన్లు ప్రతి ఒక్కరికి సమానంగా అందించాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ పనిచేస్తుంది.. జాతీయ స్థాయిలో విలువలతో కూడిన రాజకీయాలు చేసే బీసీ నేతలను ఆహ్వానించడం జరిగింది.. ఓబీసీలకు జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు తేవడం కోసమే ఈ సమావేశం నిర్వహించాలన్నదే ధ్యేయంగా జరుగుతుంది అని గిడుగు రుద్రరాజు తెలిపారు.

Read Also: Uttar Pradesh: దసరా ఉత్సవాలు చూసేందుకు వచ్చిన బాలిక కిడ్నాప్, గ్యాంగ్ రేప్

2024 పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కొత్త మ్యానిఫెస్టోతో రాబోతుంది అని ఏపీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు తెలిపారు. బడుగు బలహీన వర్గాల యొక్క అభివృద్ధి కోసం 2024 ఎన్నికలకు కాంగ్రెస్ సన్నద్ధమైంది.. గుంటూరులో రేపు జరిగే ఓబీసీ సంఘాల సదస్సును జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి తక్షణమే తాడేపల్లి ప్యాలెస్ వదలి పొలం బాటపట్టాలని హితవుపలికారు.. ఇప్పట్టికి రాయలసీమ ప్రాంతంలో తాగు సాగునీటి సమస్య తీవ్రంగా ఉంది అని ఆయన పేర్కొన్నారు. రైతాంగం వర్షాభావ పరిస్థితులతో తీవ్ర దుర్భిక్షం అనుభవిస్తున్నారు.. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అదుపులో లేకుండా పోయింది.. మానభంగలు, హత్యలు, దోపిడీలు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అంటూ గిడుగు రుద్రరాజు ఆరోపించారు.

Read Also: Praveen IPS: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బయోపిక్.. ‘ప్రవీణ్ ఐపీఎస్’ గ్లింప్స్ రిలీజ్

రాష్ట్రంలో పోలీసు రాజ్యాంగం నడుస్తుంది.. ప్రతిపక్షాలపై దాడులు, కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టడంపై గిడుగు రుద్రరాజు దుయ్యబట్టారు. అధికార, ప్రతిపక్ష నేతల మధ్య దాయాదుల పోరు కొనసాగుతోంది.. న్యాయ వ్యవస్థ చరిత్రలో బెయిల్ పై 10సంవత్సరాలు బయట తిరగడం చూస్తే సిగ్గుపడాల్సి వస్తుంది.. వైసీపీ సామాజిక సాధికారిత యాత్ర అనేది ఒక బూటకపు యాత్రగా అభివర్ణించారు.. రాష్ట్రంలో ఒక వర్గం వారే పరిపాలన వ్యవస్థ కొనసాగించడం దారుణం అంటూ గిడుగు రుద్రరాజు మండిపడ్డారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన దగ్గర నుంచి ఈస్ట్ ఇండియా కంపెనీ మాదిరిగా దోచుకోవడమే లక్ష్యంగా పనిచేస్తుంది.. బీజేపీ ఈడీ, సీబీఐతో మాత్రమే దేశంలో పరిపాలన కొనసాగిస్తోంది.. చంద్రబాబు అరెస్ట్ అక్రమం, అన్యాయం, రాజకీయ విరుద్ధంగా జరిగిందని గిడుగు రుద్రరాజు ఖండించారు.