Site icon NTV Telugu

Atchainnaidu : అచ్చెన్నాయుడు అధ్యక్షతన ఆప్కాబ్‌ సమావేశం

Atchannaidu

Atchannaidu

మంత్రి అచ్చెన్నాయుడు అధ్యక్షతన నేడు ఆప్కాబ్‌ సమావేశం జరుగనుంది. ఈ సమావేశానికి వ్యవసాయ, సహకార, మార్కెటింగ్‌, మత్స్యశాఖ అధికారులు హాజరుకానున్నారు. రైతులకు రుణాలు అందజేత అంశంపై సమీక్షించనున్నారు. అయితే.. బుధవారం శ్రీకాకుళం జిల్లా టెక్కలిలోని తన క్యాంపు కార్యాలయంలో ఆప్కాబ్ అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. గత వైఎస్సార్‌సీపీ హయాంలో అక్రమంగా దారి మళ్లించిన సహకార సంఘాల నిధులను రాష్ట్ర ప్రభుత్వం రికవరీ చేస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి కె. అచ్చెన్నాయుడు అన్నారు. అధికారులే బినామీ పేర్లతో రుణాలు పొందినట్లు తన దృష్టికి వచ్చిందని మంత్రి తెలిపారు.

Amaravathi : నేడు రాజధాని అమరావతిలో రెండో రోజు ఐఐటీ నిపుణుల పర్యటన

మొత్తం వ్యవస్థను ప్రక్షాళన చేయడంతోపాటు అన్ని సహకార సంఘాలను ఆన్‌లైన్‌లోకి తీసుకురావాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. రైతులు ఒక్కరోజులోనే రుణాలు పొందే విధంగా వ్యవస్థను ఏర్పాటు చేయాలని, ఇందుకు సంబంధించి చర్యలు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. రైతుల ఆధార్ కార్డులను మీ భూమి, ఈసీ, ఈ క్రాప్‌తో అనుసంధానం చేసి రుణాలు మంజూరు చేయాలని ఆయన కోరారు. ఆప్కాబ్-డీసీసీబీల నుంచి సహకార సంఘాల ద్వారా రైతులకు రూ.38.7 కోట్లు అందించేందుకు కార్యాచరణ ప్రణాళిక అమలు చేయనున్నారు. రుణాలు పొందడంలో రైతులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు చూడాలని అన్నారు.

Terrorist Attack: జమ్మూలో ఉగ్రవాదుల దాడి భయం.. ఆర్టికల్ 370 వార్షికోత్సవానికి ముందే హై అలర్ట్

Exit mobile version