Son Calls his Father: ఉపాధి కోసం మరో దేశానికి వెళ్లి ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారని కొన్ని ఘటనలు వెలుగు చూసినప్పుడు తెలుస్తోంది.. ఇప్పటికే సౌదీ లాంటి ప్రాంతాల్లో పనుల కోసం వెళ్లి.. ఎన్నో కష్టాలు పడుతూ.. ఇక, మా వళ్ల కావడం లేదు.. దయచేసి.. నన్ను ఈ ఊబినుంచి రక్షించండి.. అంటూ కుటుంబ సభ్యులకు.. పాలకులకు సోషల్ మీడియా ద్వారా విజ్ఞప్తి చేయడం.. వారి చొరవతో.. స్వదేశానికి వచ్చిన ఘటనలు ఎన్నో ఉండగా.. ఇప్పుడు.. నెల్లూరు జిల్లాకు చెందిన యువకుడు సౌదీలో నరకాన్ని అనుభవిస్తున్నాడు..
Read Also: Pakistan: పాకిస్తాన్‌లో ఎలాంటి రేడియేషన్ లీక్ లేదు: IAEA
నాన్నా.. నన్ను రోజూ చిత్ర హింసలు పెట్టి చంపేస్తున్నారు. బయటకు రానివ్వడం లేదు.. నన్ను తిరిగి భారత్‌కు తీసుకువెళ్లు నాన్న అంటూ ఉపాధి నిమిత్తం సౌదీ అరేబియాకు వెళ్లిన ఓ యువకుడు ఫోన్‌లో తండ్రికి తన గోడును వెలిబుచ్చాడు.. బాధితుడి తల్లిదండ్రుల వివరాల ప్రకారం.. నెల్లూరు జిల్లా కలువాయి మండలం కుల్లూరుకు చెందిన కాలేషా, బీబీల కుమారుడు నజీర్‌బాషా డిసెంబర్‌లో ఉపాధి నిమిత్తం సౌదీ అరేబియాకు వెళ్లారు. అక్కడ ఓ యజమాని వద్ద పనిలో చేరారు. అనుకున్న పని కాకుండా వేరే దానికి అప్పగించడంతో సరిగా చేయలేకపోయాడు.. ఒక రోజు చెట్టు ఎక్కి కొమ్మలు కొట్టమని చెప్పారు.. చేతకాకపోయినా.. చేసిన పని కాకున్నా.. చెట్టుపైకి ఎక్కడంతో కిందపడి తీవ్ర గాయాలపాలయ్యాడు.. వైద్యుల వద్ద చికిత్స తీసుకుని.. కొద్దిరోజులు తెలిసిన వారి దగ్గర విశ్రాంతి తీసుకున్నాడు. ఇక, యజమాని దళారికి ఫోన్ చేసి.. ఒప్పంద సమయం ఇంకా ఉందని, నజీర్‌బాషాను పంపించాలని డిమాండ్ చేశాడు.. దాంతో మళ్లీ అక్కడికే పనికి వెళ్లాడు. మూడు నెలలు పనిచేయించుకుని జీతం అడిగితే చిత్రహింసలు పెడుతూ.. చెట్టుకు కట్టేసి చితక బాదారంటూ కన్నీరుమున్నీరవుతున్నా ఆ బాధితుడు.. తల్లిదండ్రులకు ఏడుస్తూ ఫోన్ చేసి.. తన గోడు చెప్పుకున్నాడు.. అయితే, తమ కుమారుడిని తిరిగి రప్పించడానికి ప్రభుత్వ పెద్దలు సాయం చేయాలని ఆ కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు..
