NTV Telugu Site icon

AP Weather: బలపడిన తీవ్ర అల్పపీడనం.. రానున్న 3 రోజుల్లో కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు!

Ap Weather

Ap Weather

AP Weather: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కోస్తా తీరం పైపు దూసుకొస్తోంది. ఇది బుధవారం తీవ్ర అల్పపీడనంగా రూపాంతరం చెందింది. రానున్న 24 గంటల్లో తమిళనాడు,ఏపీ తీరం పైపు వెళ్లే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. రానున్న 3 రోజుల్లో కోస్తా జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్ష సూచన ఉన్నట్లు ఐఎండీ పేర్కొంది. తీరం వెంబడి 30-35 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

Read Also: Vizag: కెనడాలో గాజువాక యువకుడు అనుమానాస్పద మృతి

డిసెంబర్19న :
* శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం జిల్లాల్లోని కొన్ని ప్రదేశాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

• తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

డిసెంబర్ 20న :

• శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

* పార్వతీపురం మన్యం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, బాపట్ల, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

 

Show comments