Site icon NTV Telugu

Swarna Ward: ఏపీలో కీలక నిర్ణయం.. ఇకపై ‘వార్డు సచివాలయం’ కాదు ‘స్వర్ణ వార్డు’

Ap Sachivalayam Neme Chenge

Ap Sachivalayam Neme Chenge

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మున్సిపాలిటీలు, పట్టణాలు మరియు నగరాల్లోని వార్డు సచివాలయాల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై వీటిని ‘వార్డు సచివాలయం’ అని కాకుండా ‘స్వర్ణ వార్డు’గా పిలవాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఈ మేరకు వార్డు సచివాలయాల పేరును స్వర్ణ వార్డులుగా మార్చే ప్రతిపాదనకు కేబినెట్ ఇప్పటికే ఆమోదం తెలిపింది. ఈ మార్పు ద్వారా ప్రజలకు మరింత నాణ్యమైన, మెరుగైన సేవలను అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఈ పేరు మార్పుకు సంబంధించి ప్రభుత్వం తాజాగా అధికారికంగా గెజిట్‌ను కూడా విడుదల చేసింది. పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్. సురేశ్ కుమార్ దీనికి సంబంధించిన ఉత్తర్వులను జారీ చేశారు. ఈ తాజా మార్పుతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పట్టణ ప్రాంతాల్లోని సచివాలయాల బోర్డులు, అధికారిక రికార్డుల్లో ఇకపై ‘స్వర్ణ వార్డు’ అనే పేరు అమల్లోకి రానుంది. పాలనలో సంస్కరణలు తీసుకువస్తూ, ప్రజలకు చేరువయ్యే క్రమంలో ప్రభుత్వం ఈ కీలక అడుగు వేసింది.

Exit mobile version