Mahanadu 2023: 160 స్థానాల్లో గెలవడం.. టీడీపీ అధికారంలోకి రావడం ఖాయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mahanadu 2023: వచ్చే ఎన్నికల్లో 160 స్థానాలను టీడీపీ గెలుచుకోవడ.. అధికారంలోకి రావడం ఖాయం అన్నారు తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు.. రాజమండ్రిలో ప్రారంభమైన టీడీపీ మహానాడులో ఆయన మాట్లాడుతూ.. అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా.. టీడీపీది ప్రజాపక్షమే అన్నారు. 2019లో ఓ దొపిడీ దొంగకు ప్రజలు ఓట్లేసి తప్పు చేశారన్నారు. సంక్షేమాన్ని.. దాంతో సమానంగా అభివృద్ధి చేశాం. కానీ, మనం చేసిన పనులను చెప్పుకోలేకపోయాం. టీడీపీని ఎదుర్కొలేక కోడి కత్తి డ్రామా, సొంత బాబాయిని చంపి ప్రజల సింపతితో జగన్ సీఎం అయ్యారని విమర్శించారు.. సీఎం జగన్.. వేటాడి.. వెంటాడి తరిమి కొట్టే రోజులు వచ్చాయని హెచ్చరించారు.. 151 స్థానాలు రావడంతో జగన్కు కళ్లు నెత్తికెక్కాయి.. ఒళ్లు మదమెక్కింది. ఇంత అనుభవమున్న పార్టీ అయినా సరే గత నాలుగేళ్లల్లో ఎన్నో కష్టాలు పడ్డామన్నారు.
ఏపీలోని ఐదు కోట్ల మంది ప్రజలు సీఎం జగన్ని ఛీకొడుతున్నారని వ్యాఖ్యానించారు అచ్చెన్నాయుడు.. సీఎం జగన్ నంగనాచి మాటలు మాట్లాడుతున్నారు. జగన్ పేదవాడంట.. చంద్రబాబు ధనవంతుడట. జగన్ అబద్దాల కోరు అంటూ మండిపడ్డారు.. 28 రాష్ట్రాల సీఎంలకు రూ. 508 కోట్లు ఉంటే.. జగన్ ఒక్కడికే అంత ఆస్తి ఉంటుందన్న ఆయన.. 30 కేజీలున్న జగన్కు ఏడు బంగళాలు కావాలంట.. బెంగళూరు, ఇడుపులపాయ, లోటస్ పాండ్, అమరావతిలో ప్యాలెస్ ఎవరిది..? అని నిలదీశారు. ఉత్తరాంధ్రని ఉద్ధరిస్తానంటూ విశాఖలో రాజధాని పెట్టి అక్కడో ఇల్లు కడతాడంట. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉత్తరాంధ్రలోనే కాదు.. పులివెందులలో కూడా కర్రు కాల్చి వాత పెట్టారని ఎద్దేవా చేశారు.
Also Read
- POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!
- Liquor Ban: ఏంటి! ఇన్ని రోజులు "బ్రాండెడ్ విషం" తాగారా? ఓల్డ్ మాంక్, రాయల్ ఛాలెంజ్ సహా ఈ బ్రాండ్ల గుట్టు రట్టు..
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
చంద్రబాబు కట్టిన టిడ్కో ఇళ్లను పక్కన పెట్టేసి.. సెంటు పట్టా ఇచ్చారు. నాలాగా పొడవుగా ఉండే వాడికి సెంటు పట్టా సరిపోతుందా..? అని ప్రశ్నించారు అచ్చెన్నాయుడు.. ప్రతి మహిళా ఓ ఆడియరుగా మారాలి. గతంలో ఇంటి ఖర్చు ఎంతైంది..? ఇప్పుడు ఎంతైందో ఆలోచించండి అని సూచించారు. ఇక, రూ. 2 వేల నోట్ల రద్దుతో తన దగ్గరున్న నోట్లను ఏం చేయాలో తెలియక జగన్ తల పట్టుకుంటున్నారన్న ఆయన.. లోకేష్ పాదయాత్ర అద్భుతంగా జరుగుతోంది. ఓ ఆశయం గురించి 48 డిగ్రీల ఎండలో లోకేష్ పాదయాత్ర దిగ్విజయంగా సాగుతోంది. మహానాడుకు ప్రభుత్వం బస్సులు ఇవ్వకుండా.. రాకుండా చేశారని మండిపడ్డారు.. మహానాడు కోసం అలంకరణ చేస్తే.. జగన్ బ్లేడ్ బ్యాచ్.. ఫ్లెక్సీలను బ్లేడ్లతో కోసేశారని ఆరోపించారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు.
తాజావార్తలు
-
Salman Khan: ఒక బాత్రూమ్కు 70 మంది.. జైల్లో గడిపిన రోజులు గుర్తు చేసుకున్న సల్మాన్ ఖాన్..
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!
-
Liquor Ban: ఏంటి! ఇన్ని రోజులు “బ్రాండెడ్ విషం” తాగారా? ఓల్డ్ మాంక్, రాయల్ ఛాలెంజ్ సహా ఈ బ్రాండ్ల గుట్టు రట్టు..
-
Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి అన్ని అడ్డంకులే, తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకూడదు!
-
Oppo A7 Pro Max: ఒప్పో A7 ప్రో మాక్స్ రిలీజ్.. 10000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. ధర, ఫీచర్లు ఇవే!
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!