Site icon NTV Telugu

AP Budget: బడ్జెట్‌పై ఎమ్మెల్యేలకు అవగాహన.. ప్రారంభించనున్న స్పీకర్

Ap Budget

Ap Budget

AP Budget: సోమవారం ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. రూ.2.94 లక్షల కోట్లతో మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఇదిలా ఉండగా.. ఇవాళ‌ఉదయం 10‌ గంటలకు బడ్జెట్‌పై ఎమ్మెల్యే లకు అవగాహనా కార్యక్రమం నిర్వహించనున్నారు. అసెంబ్లీ కమిటీ హాల్‌లో ఎమ్మెల్యేలకు బడ్జెట్‌ అవగాహన కార్యక్రమాన్ని స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రారంభించనున్నారు. కొత్త ఎమ్మెల్యేలకు బడ్జెట్‌పై అవగాహన, అసెంబ్లీ కార్యక్రమాలు స్పీకర్, ఇతర సీనియర్ నేతలు వివరించనున్నారు. ఈ కార్యక్రమం తర్వాత మద్యాహ్నం ఎన్డీయే ఎమ్మెల్యేల సమావేశం జరగనుంది. అసెంబ్లీ సమావేశాలు, వైసీపీ ఎజెండా, ఇతర అంశాలపై ఎన్డీఏ ఎమ్మెల్యేల సమావేశంలో చర్చించనున్నారు. మరోవైపు నేడు కూటమి శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు కూటమి నేతలు భేటీ కానున్నారు. ప్రభుత్వ చీఫ్ విప్, విప్‌లను ఖరారు చేసే అవకాశం ఉంది.

 

Exit mobile version