NTV Telugu Site icon

Tammineni Sitaram: కులగణన కోసం శ్రీకాకుళం జిల్లా నుంచే శ్రీకారం..

Tammineni Sitaram

Tammineni Sitaram

Tammineni Sitaram: ప్రతిపక్షాలు అవాకులు, చవాకులు మాట్లాడుతున్నారని.. అది తప్పు అని చెప్పడానికే ఈ సభ ఉద్దేశమని విజయనగరం జిల్లా రాజాంలో సామాజిక సాధికారిక యాత్రలో స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. జగన్మోహన్‌ రెడ్డి సామాజిక, సాధికారిక జైత్రయాత్ర ఇది అంటూ ఆయన పేర్కొన్నారు. జోగులు అందరివాడు.. సామాన్య జనంతో కలిసిపోయే మనసత్వం ఉన్న వ్యక్తి అని స్పీకర్ తమ్మినేని సీతారాం చెప్పారు. జగన్ పిలుపు ఇస్తే ఈ రోజు రాజాంలో జనప్రవాహం కదిలి వచ్చిందన్నారు. తాండ్రపాపారాయుడు పుట్టిన గడ్డ ఇది… అన్యాయాలను, అవినీతిని సహించం… తిరగబడతామన్నారు. రాజ్యాంగబద్దంగా అందరికీ రాజ్యాధికారంలో భాగస్వామ్యం ఇచ్చాం… ఈ యాత్ర ముఖ్య ఉద్దేశమే ఇది అని ఆయన వెల్లడించారు. అన్ని కులాలకు కార్పొరేషన్లు ఇచ్చి 700 మంది డైరెక్టర్లను నియమించిన ఘనత సీఎం జగన్‌దే అన్నారు. కులగణన జరగాలని దేశంలో మొట్టమొదటిసారిగా క్యాబినెట్ నిర్ణయం తీసుకుందన్నారు. కులగణన కోసం శ్రీకాకుళం జిల్లా నుండే శ్రీకారం చుట్టడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారన్నారు. అభివృద్ది అంటే పేదలు సంతృప్తిగా జీవించడం, విద్య, వైద్యం ఉచితంగా అందించడమే అభివృద్ది… అదే జగన్ చేశారన్నారు. నాడు నేడు పేరుతో కార్పోరేట్‌ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు నిర్మించాం… ఇది అభివృద్ది కాదా అంటూ ప్రశ్నించారు.

Also Read: Chelluboina Venugopalakrishna: చంద్రబాబు సామాజిక వర్గాల మధ్య చిచ్చు పెడుతున్నాడు..

ప్రభుత్వ పాఠశాలల్లో బ్రహ్మండమైన ఫర్నీచర్, మంచి టాయిలెట్స్ నిర్మాణం, ఉచితంగా విద్యా కిట్స్ ఇచ్చామన్నారు. పిల్లలకు ఇచ్చే మెనూ కూడా జగన్మహన్‌రెడ్డే తయారు చేస్తున్నారన్నారు. 36 పథకాలు ప్రవేశపెట్టాం… అందరికీ అవినీతి లేకుండా తన, పర బేధం లేకుండా ఇచ్చామన్నారు. ఎవరైనా మా పార్టీ వారు 100 రూపాయలైనా లంచంగా అడిగారా… ఎవరైనా చెప్పండి…లేదు కదా… ఇది జగన్ పాలన అంటూ పేర్కొన్నారు. పేదల్లో కొనుగోలు శక్తి పెరిగింది… ఇదే అభివృద్దికి సూచి అని తెలిపారు. పారిశ్రామిక దిగ్గజాలు ఏపీలో పరిశ్రమలు పెట్టడానికి వస్తున్నారని తమ్మినేని సీతారాం చెప్పారు. స్థానిక యువతకే పెద్దపీట వేసేలా సీఎం పారిశ్రామికవెత్తలకు చెప్పారు… ఆ ఉద్యోగాలు మీ కొరకేనని చెప్పుకొచ్చారు. ఆమదాలవలస మున్సిపాల్టీలో 2200 ఇళ్లు ఒకేసారి కట్టాం.. అక్కడ ఓ ఊరే వెలిసిందన్నారు. పొరపాటు చేశామా దోపిడిదారుల చేతుల్లోకి అధికారం వెళుతుందన్నారు. 3 వేల కోట్ల రూపాయలతో స్కిల్ కేసుల దొంగలు మరలా వస్తారన్నారు. చంద్రబాబునాయుడుపై పెట్టిన కేసులు కేంద్ర ప్రభుత్వ అధికారులు పెట్టారు… జగన్ పెట్టలేదు.. ఒకసారి ఆలోచించాలన్నారు. జగన్ కడిగిన ముత్యం అని జేడి లక్ష్మీనారాయణే చెప్పారన్నారు. చంద్రబాబు న్యాయస్థానంలో నిరూపించుకో అంటూ తమ్మినేని పేర్కొన్నారు. ఆలీబాబా 40 దొంగల భారీ నుంచి మన రాష్ట్రాన్ని రక్షించుకోవాలన్నారు.

Show comments