Ayyanna Patrudu: మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు మరోసారి సెటైర్లు విసిరారు. తనకు నమస్కారం పెట్టేందుకు ఇష్టం లేకనే జగన్ అసెంబ్లీలోకి రావడం లేదని అన్నారు. వచ్చే నెలలో జరిగే సమావేశాలకు ఆహ్వానిస్తున్నానని… అక్కడికి వస్తే ఎదురెదురుగా ముచ్చటిం చుకుందామని ఆహ్వానించారు స్పీకర్. తెలుగుదేశం పార్టీది సంస్కారవంతమైన పార్టీ అని, క్యాడర్ బేస్డ్‌గా ఎదిగిన పార్టీ అని.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలాగా టీడీపీ ఉండదని అయ్యన్న అన్నారు. అనకాపల్లి జిల్లా నాతవరం మండలంలో రూ. 68 లక్షలతో చేపట్టే రోడ్డు పనులకు శంఖుస్థాపన కార్యక్రమం అనంతరం ఏర్పాటు చేసిన సభలో జగన్‌పై స్పీకర్ అయ్యన్నపాత్రుడు సెటైర్లు వేశారు.