Site icon NTV Telugu

AP SI Exam: ఎస్సై ప్రిలిమినరీ ‘కీ’ విడుదల

Ap Si Exam

Ap Si Exam

AP SI Exam: ఏపీలో శని, ఆదివారాల్లో జరిగిన ఎస్సై మెయిన్స్ పరీక్షల ప్రిలిమినరీ ‘కీ’ విడుదలైంది. ఈ రెండు రోజుల్లో విశాఖ, గుంటూరు, ఏలూరు, కర్నూలు నగరాల్లో ఎస్సై ఉద్యోగాల తుది రాత పరీక్షలు ప్రశాంతంగా ముగియగా.. ఆదివారం సాయంత్రం ప్రాథమిక కీ విడుదలైంది. ఈ పరీక్ష ప్రాథమిక కీని పోలీస్‌ రిక్రూట్‌మెంట్ బోర్డు విడుదల చేసింది. అక్టోబర్‌ 18 సాయంత్రం 5 గంటల్లోగా సమాధానాలపై అభ్యంతరాలను slprbap.obj@gmail.comకు మెయిల్‌లో పంపాలని సూచించింది. అనంతరం తుది కీతో పాటు ఫలితాలు వెల్లడించనున్నారు. ప్రశ్నా పత్రాలను అధికారిక వెబ్‌సైట్‌లో https://slprb.ap.gov.in/ అందుబాటులో ఉంచారు.

Also Read: Indrakeeladri Temple: ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకున్న స్వామి స్వరూపానంద

శని, ఆదివారాల్లో జరిగిన పరీక్షలకు 31,193 మంది అభ్యర్థులు అర్హత సాధించగా.. మొదటి రోజు పేపర్‌-1, పేపర్‌-2 పరీక్షలకు 30,585 మంది అభ్యర్థులు హాజరయ్యారు. రెండో రోజైన ఆదివారం నాడు పేపర్‌-3, పేపర్‌-4 పరీక్షలకు 30,560 మంది హాజరయ్యారు. ఏపీలో సివిల్‌, ఏపీఎస్పీ విభాగాల్లో మొత్తం 6,511 పోస్టుల భర్తీకి పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందులో సివిల్‌, ఏపీఎస్పీ విభాగాల్లో 411 ఎస్సై పోస్టులు, 6,100 కానిస్టేబుల్‌ పోస్టులున్నాయి.

Exit mobile version