ఏపీ రాజ్యసభ స్థానానికి బీజేపీ అభ్యర్థి ఖరారు అయ్యారు. రాజ్యసభ అభ్యర్థిగా బీజేపీ నేత పాక వెంకట సత్యనారాయణ పేరును ఎన్డీఏ కూటమి ఖరారు చేసింది. భీమవరంకు చెందిన సత్యనారాయణ.. ప్రస్తుతం ఏపీ బీజేపీ డిసిప్లీనరీ కమిటీ చైర్మన్‌గా ఉన్నారు. తమిళనాడుకు చెందిన అన్నామలై, ఎమ్మార్పీఎస్ నేత మందకృష్ణ మాదిగ పేర్లు రేసులో వినిపించినా.. చివరకు సత్యనారాయణకు అవకాశం దక్కింది. ఇటీవల విజయసాయి రెడ్డి రాజీనామాతో రాజ్యసభలో ఓ స్థానం ఖాళీ అయిన విషయం తెలిసిందే.
విజయసాయి రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానం భర్తీపై ఉత్కంఠ కొనసాగింది. తమిళనాడు రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలైతో భర్తీ చేస్తారని రాజకీయవర్గాల్లో విస్తృత చర్చ జరిగింది. తెలంగాణ నుంచి మందకృష్ణ మాదిగ పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం సాగింది. చివరకు పాకా వెంకట సత్యనారాయణ పేరును ఎన్డీఏ కూటమి ఖరారు చేసింది. రేపు ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నారు.
Also Read: AP News: పలు నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసిన సీఎం చంద్రబాబు!
మరో రెండేళ్ల పదవీ కాలం ఉన్న నేపథ్యంలో ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల అయింది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ గడువు ముగియనుంది. ఏప్రిల్ 30న నామినేషన్ల పరిశీలన ఉండగా.. మే 2 వరకు ఉపసంహరణకు గడువు ఉంది. మే 9న ఉదయం 9 నుంచి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్ జరగనుంది. మే 13వ తేదీతో ఎన్నికల ప్రక్రియ ముగియనుంది.
