malladi vishnu: మంత్రి వర్గ విస్తరణ నిర్ణయం జగన్ ఒక్కరికి మాత్రమే తెలుస్తుందని ఏపీ ప్లానింగ్ బోర్డు వైస్ ఛైర్మన్ మల్లాది విష్ణు అన్నారు. మంత్రి వర్గ విస్తరణపై సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోందన్నారు. రేపటి సమావేశంలో విస్తరణ సమాచారం గురించి తెలుస్తుందని ఆయన పేర్కొన్నారు. రేపు మంత్రులు, ఎమ్మెల్యేలతో జగన్ నిర్వహించే సమావేశం ప్రతి 3 నెలలకు ఒకసారి జరిగేదేనని తెలిపారు.
Read Also: KTR letter to Centre: వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై కుట్రలు ఆపండి! కేంద్రానికి కేటీఆర్ బహిరంగ లేఖ
సంక్షేమ పథకాల అమలు, గడప గడపకి ప్రభుత్వం అమలు తీరు రేపటి సమావేశం ప్రధాన అజెండా అని మల్లాది విష్ణు వెల్లడించారు. టీడీపీ వైసీపీపై చేస్తున్న దుష్ప్రచారం ఎలా తిప్పికొట్టాలో రేపటి భేటీలో చర్చిస్తామన్నారు. ముందస్తు ఎన్నికలకు సిద్దమని టీడీపీ చెప్పినా ఇంటికి పంపటానికి ప్రజలు సిద్దంగా ఉన్నారన్నారు. కొందరు నమ్మక ద్రోహం, సంస్థాగత లోపల వల్ల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాలైందని ఆయన మండిపడ్డారు. వైసీపీకి 40 మంది ఎమ్మెల్సీలు ఉన్నారని టీడీపీ గుర్తు పెట్టుకోవాలన్నారు. నిన్న అనంతపురంలో పల్లె రఘునాథ్ రెడ్డి ఓవరాక్షన్ చేశారని ఆయన ధ్వజమెత్తారు. టీడీపీ బలంగా ఉందని నమ్మించటానికి రాష్ట్రంలో పలుచోట్ల జరిగే అల్లర్లు జరగడమే ఉదాహరణ అంటూ విమర్శలు గుప్పించారు.