CCTV Cameras Offline:ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో సీసీ కెమెరాల చిత్రం.. పలు పోలింగ్ కేంద్రాల్లో ఆఫ్‌లైన్!

Cctv Cameras Offline Ap

Cctv Cameras Offline Ap

CCTV Cameras Offline: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో పోలింగ్‌ కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరుపై చర్చ మొదలైంది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1,200 సీసీ కెమెరాలు ఆఫ్‌లైన్‌లో ఉన్నట్లు సమాచారం. దీంతో పోలింగ్‌ కేంద్రాల్లో జరిగే పరిణామాల రికార్డింగ్‌, పర్యవేక్షణపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సీసీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలు ఆన్‌లైన్‌లో భద్రపరిస్తే వాటిని ఎడిట్‌ చేసే అవకాశం ఉండదని, అదే ఆఫ్‌లైన్‌లో రికార్డయితే ఫుటేజీని ఎడిట్‌ చేసే వెసులుబాటు ఉంటుందనే ఆరోణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కెమెరాలు ఆఫ్‌లైన్‌లో ఉండటంపై ఆందోళన వ్యక్తమవుతోంది.

పులివెందుల మండలంలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. మండల పరిధిలో మొత్తం 19 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయగా.. వాటిలో కేవలం ఐదు మాత్రమే ఆన్‌లైన్‌లో పనిచేస్తున్నట్లు సమాచారం. మిగిలిన 14 కెమెరాలు ఆఫ్‌లైన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఎన్నికల సమయంలో పోలింగ్‌ కేంద్రాల పర్యవేక్షణకు సంబంధించిన ఏర్పాట్లపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా సాగేందుకు పోలింగ్‌ కేంద్రాల్లో సీసీ కెమెరాల రికార్డింగ్‌ సక్రమంగా పనిచేయడం కీలకం. ఆఫ్‌లైన్‌లో ఉన్న కెమెరాల ఫుటేజీ కూడా భద్రంగా స్టోర్ అవుతోందా?.. దాన్ని ఎవరు పర్యవేక్షిస్తున్నారు?.. రికార్డింగ్‌ను ఎవరైనా మార్చే అవకాశం ఉందా? అనే అంశాలపై అధికారులు స్పష్టత ఇవ్వాల్సి ఉంది.