AP Elections 2026: రేపు యథావిధిగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు.. విధుల్లో 2.52 లక్షల మంది సిబ్బంది!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP MPTC and ZPTC Elections 2026: ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మురసు తుఫాన్ ప్రభావం, భారీ వర్షాల నేపథ్యంలో ఎన్నికల ఏర్పాట్లపై రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టి సారించింది. క్షేత్రస్థాయి పరిస్థితులను సమీక్షించిన అనంతరం రాష్ట్రవ్యాప్తంగా రేపు ఎన్నికలు యథావిధిగా నిర్వహించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా కీలక వివరాలు వెల్లడించారు.
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. భారీ వర్షాలు, స్థానిక పరిస్థితులు, మురసు తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఎన్నికల ఏర్పాట్లపై సమీక్షించారు. తుఫాన్ ప్రభావం ఉన్న ప్రాంతాల్లో పోలింగ్‌కు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, కలెక్టర్లు సమర్పించే నివేదికల ఆధారంగా అవసరమైన నిర్ణయాలు తీసుకోవాలని స్పష్టం చేశారు. పోలింగ్ ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
Also Read
- Sankranti 2027 Box Office: టాలీవుడ్ టు కోలీవుడ్.. సంక్రాంతి 2027 బరిలో రూ.1000 కోట్ల దండయాత్ర.!
- KTR: మా ప్రభుత్వం రాగానే ఆ భూములు వెనక్కి తీసుకుంటాం..
- Virat Kohli: "ఏ దిగ్గజానికీ సాధ్యంకాలే".. వన్డేల్లో విరాట్ కోహ్లీ వరల్డ్ రికార్డ్.. ఏకైక బ్యాట్స్‌మన్‌గా విరాట్ హిస్టరీ..
- AP Cyclones Damage: సీఎం చంద్రబాబుకు ప్రధాని మోడీ ఫోన్.. ఏపీపై రెండు తుఫాన్ల ప్రభావంపై ఆరా!
రాష్ట్రవ్యాప్తంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కోసం మొత్తం 31,460 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఎస్ఈసీ వెల్లడించింది. ఈ ఎన్నికల్లో సుమారు 2.61 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎన్నికల విధుల కోసం దాదాపు 2.52 లక్షల మంది సిబ్బందిని నియమించారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ కోసం సుమారు 52 వేల మంది సిబ్బందిని సిద్ధం చేశారు. ఇక పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు సీసీటీవీ కెమెరాలు, వీడియోగ్రఫీ ద్వారా నిరంతర పర్యవేక్షణ చేపట్టనున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 9,821 ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. వాటిలో 2,051 స్థానాలు ఇప్పటికే ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 7,770 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు కలిపి మొత్తం 18,843 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లన్నీ పూర్తి చేశామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా తెలిపారు. భారీ వర్షాలు, తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లోనూ స్థానిక పరిస్థితులకు అనుగుణంగా చర్యలు తీసుకుంటూ పోలింగ్‌ను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులు సిద్ధమయ్యారు.
తాజావార్తలు
-
AP Elections 2026: రేపు యథావిధిగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు.. విధుల్లో 2.52 లక్షల మంది సిబ్బంది!
-
Sankranti 2027 Box Office: టాలీవుడ్ టు కోలీవుడ్.. సంక్రాంతి 2027 బరిలో రూ.1000 కోట్ల దండయాత్ర.!
-
Sandeep Reddy Vanga : ‘పనిపాట లేని ఫ్లాప్ ఆర్టిస్టులు.. ఆ పరాన్నజీవుల ఏడుపంతా సినిమాలపైనే!
-
KTR: మా ప్రభుత్వం రాగానే ఆ భూములు వెనక్కి తీసుకుంటాం..
-
Virat Kohli: “ఏ దిగ్గజానికీ సాధ్యంకాలే”.. వన్డేల్లో విరాట్ కోహ్లీ వరల్డ్ రికార్డ్.. ఏకైక బ్యాట్స్‌మన్‌గా విరాట్ హిస్టరీ..
ట్రెండింగ్
-
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 188 కి.మీ ప్రయాణం.. స్పోర్టీ లుక్‌తో కొత్త ఎలక్ట్రిక్ బైక్ Hero VIDA VXZ..
-
హోండా తొలి ఎలక్ట్రిక్ ఎస్యూవీ వచ్చేస్తోంది.. డిసెంబర్ 2న Honda ALPHA గ్లోబల్ లాంచ్..!
-
Sachin Tendulkar: నచ్చిన ఆటగాళ్లను ఎంచుకోలేకపోయా.. టీమిండియాపై సచిన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
IPL 2027-CSK: ఐపీఎల్లో సీఎస్కే భారీ ప్లాన్.. రూ.13 కోట్ల సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్‌పై కన్ను!
-
Rohit Sharma: వయసు జస్ట్ నంబర్ మాత్రమే.. రోహిత్ శర్మ డైవ్ చూస్తే ‘వావ్’ అనాల్సిందే.!