NTV Telugu Site icon

Minister TG Bharath: ఏపీకి చంద్రబాబే పెద్ద బ్రాండ్..100 రోజుల్లో కొత్త పారిశ్రామిక విధానం

Tg Bharath

Tg Bharath

Minister TG Bharath: వాళ్లు ఇష్టముంటే వాళ్లొస్తారు.. పరిశ్రమలు పెట్టాలనుకుంటే పెడతారు అనేది గత ప్రభుత్వ పాలసీ అని.. పారిశ్రామిక వేత్తలకు రెడ్ కార్పెట్ వేయం.. ఛార్టెడ్ ఫ్లైట్ పెట్టేది లేదని గత ప్రభుత్వం చెప్పేసిందని ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ తీవ్రంగా విమర్శించారు. 2014-19 మధ్య కాలంలో జరిగిన పారిశ్రామికాభివృద్ధిని ఆ తర్వాత ప్రభుత్వం అందుకోలేకపోయిందని మంత్రి అన్నారు. గత ప్రభుత్వంలో పరిశ్రమలు పెట్టడానికి ఎవరైనా వస్తే.. వాటాలు అడిగే పరిస్థితి ఉందని ఆరోపించారు. ఏపీకి సరికొత్త పారిశ్రామిక విధానం తీసుకొస్తామని.. 100 రోజుల్లో కొత్త పారిశ్రామిక విధానాన్ని రూపొందిస్తామని మంత్రి పేర్కొన్నారు.

Read Also: DSPs Transfer: ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం.. ఒకేసారి 96 మంది డీఎస్పీల బదిలీ..

బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ పాలసీని పరిశ్రమల కోసం తెస్తామని హామీ ఇచ్చారు. ఏపీకి చంద్రబాబే పెద్ద బ్రాండ్ అని.. పారిశ్రామిక వేత్తలకు నమ్మకం కలిగిస్తే చాలు పెట్టుబడులు వస్తాయన్నారు. పరిశ్రమలకు కావాల్సిన అనుమతులకు ఇబ్బందులు లేకుండా చేస్తామన్నారు. మల్లవల్లి పారిశ్రామిక వాడలో భూముల ధరలను గత ప్రభుత్వం అమాంతం పెంచేసిందని.. మల్లవల్లి పారిశ్రామిక వాడలో భూముల ధరలను తగ్గిస్తామన్నారు. కొత్తగా నాలుగు ఇండస్ట్రీటల్ క్లస్టర్లు ఏర్పాటు చేస్తున్నామన్న మంత్రి.. కుప్పం, లేపాక్షి, దొనకొండ, మూలపేట ప్రాంతాల్లో కొత్త ఇండస్ట్రీయల్ క్లస్టర్లు ఏర్పాటు చేయబోతున్నామన్నారు. శ్రీ సిటీ తరహాలో ఇండస్ట్రీయల్ పార్కులను డెవలప్ చేస్తామన్నారు. పీపీపీ మోడల్‌లో ఇండస్ట్రీయల్ క్లస్టర్లు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. గతంతో పోల్చుకుంటే పారిశ్రామిక వేత్తల ఫ్లో అనేది పెరిగిందన్నారు. హోటళ్లల్లో ఆక్యుపెన్సీ కూడా పెరిగిందన్నారు. బీపీసీఎల్ పెట్టుబడులు పెట్టబోతోందని.. బీపీసీఎల్ రిఫైనరీ పెట్టేందుకు నాలుగు ప్రాంతాలను ఆప్షన్‌గా ఇచ్చామని మంత్రి టీజీ భరత్ చెప్పారు. మూలపేట, కాకినాడ, రామాయపట్నం, బందరు ప్రాంతాల్లో బీపీసీఎల్ రిఫైనరీ పెట్టాలని ప్రతిపాదనలు పెట్టామన్నారు. గత ప్రభుత్వంలో వెళ్లిపోయిన పరిశ్రమలను తిరిగి తెచ్చే ప్రయత్నం చేస్తున్నామన్నారు.గత ప్రభుత్వ తీరుతో కియా అనుబంధ పరిశ్రమలు పారిపోయాయని.. కియా అనుబంధ పరిశ్రమలు విస్తరణ ఏమైనా చెప్పట్టాలంటే మేం సహకరిస్తామని ఆయన వ్యాఖ్యానించారు.

Read Also: CM Chandrababu: 5 నూతన పాలసీలు, 4 చోట్ల కొత్త క్లస్టర్లు.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

ఎంఎస్‌ఎంఈలకు రూ. 500 కోట్లు ప్రోత్సాహకాలు పెండింగులో ఉన్నాయన్నారు. పెండింగులో ఉన్న ఇన్సెంటీవ్స్‌ను కచ్చితంగా ఇస్తామని.. అయితే ఎప్పటిలోగా చేయగలమనేది చూస్తామన్నారు. కరెంట్ ఛార్జీలు పెంచేయడం వల్ల చాలా పరిశ్రమలు భయపడిపోయాయని ఆయన తెలిపారు. గత పదేళ్ల కాలంలో ఎన్ని ఎంఓయూలు చేసుకున్నాం.. ఎన్ని గ్రౌండ్ అయ్యాయి.. ఇంకా గ్రౌండ్ కానివి ఏంటీ..? అనేది విశ్లేషిస్తున్నామని చెప్పుకొచ్చారు. స్థానిక యువతకు నైపుణ్యం పెంచేలా చేస్తామన్నారు. నైపుణ్యం ఉంటే.. స్థానికులకే ఉద్యోగాలు వస్తాయన్నారు. స్థానికంగా నైపుణ్యం ఉన్న ఉద్యోగులు దొరికితే.. కంపెనీలు వాళ్లనే రిక్రూట్ చేసుకుంటాయని మంత్రి టీజీ భరత్ స్పష్టం చేశారు.