NTV Telugu Site icon

Minister RK Roja: సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ను నేను అలా అనలేదు.. క్లారిటీ ఇచ్చిన మంత్రి రోజా

Roja

Roja

Minister RK Roja: టీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ సీఎం ఎన్టీఆర్‌ శతజయంతి వేడుకల్లో పాల్గొన్న సూపర్‌స్టార్‌ రజనీకాంత్.. ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారమే రేగింది.. సీనియర్ ఎన్టీఆర్‌తో తనకు ఉన్న అనుబంధం గురించి గుర్తుచేసుకున్నారు రజినీకాంత్.. ఇక, టీడీపీ చీఫ్‌ చంద్రబాబు పరిపాలనపైనా ప్రశంసలు కురిపించారు. అయితే, రజనీకాంత్‌ వ్యాఖ్యలకు మంత్రి రోజా కౌంటర్‌ ఇచ్చారు. రజనీకాంత్‌కు తెలుగు రాష్ట్రం, రాజకీయాలపై అవగాహన లేదని విమర్శలు చేశారు. రజనీకాంత్‌ వ్యాఖ్యలతో ఎన్టీఆర్‌ ఆత్మ కూడా బాధపడుతుందన్నారు. రజనీకాంత్‌తో చంద్రబాబు అబద్ధాలు చెప్పించారు. ఎన్టీఆర్‌ ఏమన్నారో.. రజనీకాంత్‌కు వీడియోలు ఇస్తాను. ఎన్టీఆర్‌పై దారుణంగా కార్టూన్లు వేసి అవమానించిన వ్యక్తి చంద్రబాబు. రజనీకాంత్‌కు తెలుగు రాష్ట్రం, రాజకీయాలపై అవగాహన లేదు. రజనీకాంత్‌ వ్యాఖ్యలతో ఎన్టీఆర్‌ ఆత్మ కూడా బాధపడుతుంది. ఎన్టీఆర్‌ అభిమానులను బాధపట్టేలా రజనీకాంత్‌ మాట్లాడారంటూ దుయ్యబట్టిన విషయం విదితమే.. దీంతో, రజనీకాంత్‌ ఫ్యాన్స్‌కు టార్గెట్‌గా మారిపోయారు మంత్రి రోజా.. ఈ నేపథ్యంలో.. ఈ రోజు తిరుమలలో మీడియాతో మాట్లాడిన ఆమె.. రజనీకాంత్ వాఖ్యలపై తాను విమర్శలు చేయలేదు.. ఖండిచాను అని వివరణ ఇచ్చారు.

Read Also: Cow Attacks Old man: పగబట్టినట్టు వృద్ధుడిపై దాడి చేసి చంపేసిన ఆవు.. వీడియో వైరల్

రజనీకాంత్ ఎవరినో ఉద్దేశించి చేసిన వాఖ్యలను మాకు అపాదిస్తూ సోషయల్ మీడియాలో ట్రోల్ చేస్తూన్నారని ఆవేదన వ్యక్తం చేశారు మంత్రి రోజా.. ఇక, లోకేష్ పాదయాత్రలో ప్రతి నియోజకవర్గంలో మోరుగుతున్నాడు.. పవన్ కల్యాణ్‌ షూటింగ్ గ్యాప్ లో చంద్రబాబు ఫ్యాకేజిని తీసుకోని విమర్శలు చేస్తున్నాయంటూ మండిపడ్డారు. ఐటీ నోటీసులపై చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్‌ ఎందుకు స్పందించడం లేదు అని నిలదీశారు. మరోవైపు.. అమరావతిలో అక్రమాలకు పాల్పడిన డబ్బులను బ్రహ్మిణి, భువనేశ్వరి లెక్కల్లో పెట్టారు.. చంద్రబాబు, లోకేష్ ని విచారించి అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. మరోవైపు.. టీడీపీ కొత్త పాలకమండలిపై వస్తున్న విమర్శలపై స్పందిస్తూ.. కేసులు పెట్టగానే నేరచరిత్రులు కారు.. వారిని పాలకమండలిలో నియమిస్తే టీడీపీ దుష్ప్రచారం చేస్తుందని మండిపడ్డారు మంత్రి ఆర్కే రోజా.