AP Cabinet Decisions: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఒక్కో హామీని అమలు చేస్తూ వస్తుంది.. ఇక, మరో హామీని అమలు చేసేందుకు సిద్ధమైంది ప్రభుత్వం.. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ రోజు జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి ఆమోదం తెలిపింది.. కేబినెట్ సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడిన సమాచార ప్రసార శాఖా మంత్రి కొలుసు పార్థసారథి.. కేబినెట్ నిర్ణయాలను వెల్లడించారు.. కూటమి ప్రభుత్వంలో మరో ముఖ్యమైన హామీ అమలు చేయడానికి కేబినెట్ నిర్ణయం తీసుకుంది.. ఇప్పటికే ఎన్టీఆర్ భరోసా… తల్లికి వందనం… అన్నదాత సుఖీభవ అమలు అవుతున్నాయి.. ఇక, మహిళల ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం ఈ నెల 15 నుంచి ప్రారంభిస్తున్నాం అని తెలిపారు..
Read Also: India’s SuperGaming: భారతీయ ఆన్‌లైన్ గేమింగ్ కంపెనీ సంచలనం.. రూ. 132 కోట్ల సేకరణ..!
ప్రభుత్వం అనేక ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న పథకం అమలు అవుతుంది.. సీఎం చంద్రబాబు ఆర్టీసీ ఉచిత ప్రయాణానికి స్త్రీ శక్తి అని పేరు పెట్టారు.. మంత్రి లోకేష్ చొరవతో రాష్ట్రం అంతా ఈ పథకం వర్తిస్తుంది. ఏడాదికి 142 లక్షల మంది ఈ పథకం వినియోగించుకునే అవకాశం ఉందన్నారు మంత్రి పార్థసారథి.. పల్లె వెలుగు. అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్‌లో అమలు అవుతుందన్నారు.. రాష్ట్రంలో ఐటీ అభివృద్ధికి పెద్ద సంస్థలు రావాల్సిన అవసరం ఉంది… తక్కువ ధరకు ఐటీ సంస్థలకు భూములు ఇచ్చే పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపింది.. ఎకరాకు 500 ఉద్యోగాలు ఇచ్చే విధంగా పాలసీ రూపొందించాం.. ఏపీలో టూరిజం స్పాట్స్ చాలా ఉన్నాయి.. ఏపీటీడీసీ హోటళ్ల నిర్మాణం చేసి నిర్వహిస్తోంది.. అదనంగా కొంతమందికి రిసార్ట్స్, స్టార్ హోటళ్లు ఏర్పాటుకు అనుమతి ఇస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుందన్నారు.
Read Also: Top Headlines @ 5 PM: టాప్ న్యూస్
కొత్త బార్ పాలసీకి సంబంధించి కేబినెట్‌లో చర్చ జరిగింది.. అన్ని ఏ 4 షాపులకు పర్మిట్ రూమ్స్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు మంత్రి పార్థసారథి.. ఇక, సెలూన్ షాప్ నిర్వాహకులకు నాయి బ్రాహ్మణ వర్గాలకు 200 ఉచిత యూనిట్ విద్యుత్తు ఇవ్వడానికి కేబినెట్ ఆమోదించింది.. రాష్ట్రంలో 40,808 సెలూన్లకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్ అందుతుందన్నారు.. మరోవైపు, జర్నలిస్టులకు కొత్త అక్రిడేషన్ పాలసీకి కేబినెట్ ఆమోదించింది. ఎక్కువ మంది జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులను ఇచ్చేలా ఏర్పాటు చేస్తున్నాం. సోషల్ మీడియాపై కూడా ఒక పాలసీ తేవాలని సీఎం చంద్రబాబు చెప్పారని తెలిపారు.. కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా(మావోయిస్టు)పై నిషేధం మరో ఏడాది పొడిగిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుందని తెలిపారు మంత్రొ కొలుసు పార్థసారథి..
