NTV Telugu Site icon

Minister Dharmana: ఓటు అడగను, మీకు ఇష్టం ఉంటే వేయండి.. ఏపీ మంత్రి కీలక వ్యాఖ్యలు

Darmana

Darmana

ఏపీ మంత్రి ధర్మాన ప్రసాదరావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఓట్ల కోసం రాలేదు.. పెద్దపాడులో ఓటు అడగనన్నారు. మీకు ఇష్టం ఉంటే వేయండి… అలాగని మీ పనులు ఆపనని మంత్రి ధర్మాన తెలిపారు. నన్ను కాదని మీరు ఓటు వేస్తారా… మే వరకూ నేను ఉంటాను వేయండి చూద్దాం అని అక్కడి జనాలను ఉద్దేశించి అన్నారు. మీరు టీడీపీని గెలిపిస్తే జూన్ నుండి వాలంటీరు రాడు…. ఫించను రాదని తెలిపారు. టీడీపీకి ఓటు వేసేద్దాం అని చెబుతున్నారు.. పెద్దలు ఏమి పెద్దలు రా మీరు అని దుయ్యబట్టారు. త్రీ ఫేజ్ కరెంటు మీ ఊరికి వేయించుకోలేకపోయారని విమర్శించారు. తెలిసి తెలియని పనులు చేయకండి.. మీరు టీడీపీ వాళ్ల మాటల వినకండి అని మంత్రి ధర్మాన తెలిపారు.

Hyderabad Police: దీపావళి రోజు ఆ సమయంలోనే క్రాకర్స్ పేల్చాలి.. హైదరాబాద్ పోలీస్ ఆదేశాలు

ఉన్న అధికారాన్ని వదులు కోవడం అవసరమా అని మంత్రి ప్రశ్నించారు. నేను ఎమ్మెల్యేగా, మంత్రిగా లేకపోయినా మీ పనులు చేయించగలనన్నారు. ఫోన్ చేసినా పనులు చేయించగలనని తెలిపారు. జడ్డి జడ్డి పనులు చేయకండని ఫైర్ అయ్యారు. కొన్ని పనులు ఇంకా ఉన్నాయి.. కొన్ని పూర్తి చేశాను.. కొన్ని పూర్తి చేయాలి చేస్తానని అన్నారు. మీ కులపోళ్లకే పోస్టు వేయించానన్నారు. టీడీపీ వాళ్లు మీ కులపోళ్లకు ఎమ్మెల్యే గానీ, ఎమ్మెల్సీ ఇప్పించారా అని ప్రశ్నించారు.?

Bigg Boss Telugu 7: విశ్వరూపం చూపించిన శివాజీ.. గేటు తీయండి బయటికి పోతా అన్న గౌతమ్

ఎన్టీఆర్ కృష్ణుడి వేషం వేశారని ఎన్టీఆర్ ఇష్టం అని తెలుగుదేశంకు ఓటు వేస్తారా అని మంత్రి ప్రశ్నించారు. ఎన్టీఆర్ అంటే నాకు ఇష్టమే కాని ఆయన లేరని తెలిపారు. ఇప్పటికీ ఎన్టీఆర్ తెలుగుదేశం అంటే నమ్మవద్దని.. ఆయన వద్ద నుండి ఆ పార్టీని లాక్కున్నారని మంత్రి పేర్కొన్నారు. ఐదేళ్ల క్రితం పేదలు అందరూ సంతోషంగా ఉన్నారా అని ప్రశ్నించారు. ఓట్ల కోసం రాలేదు.. పెద్దపాడులో ఓటు అడగనన్నారు. మీకు ఇష్టం ఉంటే వేయండి… అలాగని మీ పనులు ఆపనని మంత్రి ధర్మాన తెలిపారు.

Show comments