AP Mayor Elections 2026: 13 కార్పొరేషన్లలో 346 నామినేషన్ల ఉపసంహరణ.. చిత్తూరులోనే అత్యధికం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసిన విషయం తెలిసిందే. అక్టోబర్ 20, 21 తేదీల్లో రాష్ట్రంలోని 13 మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో మొత్తం 346 నామినేషన్లను అభ్యర్థులు ఉపసంహరించుకున్నారు. రెండు రోజుల పాటు జరిగిన ఉపసంహరణల్లో అత్యధికంగా అక్టోబర్ 21న 345 నామినేషన్లను అభ్యర్థులు వెనక్కి తీసుకోగా.. అక్టోబర్ 20న ఒకే ఒక్క నామినేషన్ మాత్రమే ఉపసంహరించుకున్నారు.
13 మున్సిపల్ కార్పొరేషన్లలో చిత్తూరు కార్పొరేషన్ పరిధిలో అత్యధికంగా 294 నామినేషన్లు అభ్యర్థులు ఉపసంహరించుకున్నారు. దీంతో చిత్తూరులో ఎన్నికల పోటీ సమీకరణాలు ఆసక్తికరంగా మారాయి. మరోవైపు వైఎస్సార్ కడప కార్పొరేషన్ పరిధిలో ఒక్క నామినేషన్ కూడా ఉపసంహరించుకోలేదు. అక్కడ నామినేషన్ల ఉపసంహరణలు జరగకపోవడం ప్రత్యేకంగా నిలిచింది. రాజకీయ పార్టీల వారీగా చూస్తే.. తెలుగుదేశం పార్టీ నుంచి అత్యధికంగా 121 నామినేషన్లను అభ్యర్థులు ఉపసంహరించుకున్నారు. వైసీపీ నుంచి 110, స్వతంత్ర అభ్యర్థుల నుంచి 75 నామినేషన్లు వెనక్కి తీసుకున్నారు. జనసేన పార్టీ నుంచి 19, కాంగ్రెస్ నుంచి 7, బీజేపీ నుంచి 6 నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. ఇక సీపీఐ నుంచి 2, సీపీఎం నుంచి 1 నామినేషన్ ఉపసంహరణ జరిగింది. ఇతర పార్టీలకు చెందిన అభ్యర్థులు మొత్తం 5 నామినేషన్లు వెనక్కి తీసుకున్నారు.
Also Read
- Tummidihatti Barrage: తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణంపై మహారాష్ట్ర సీఎం సానుకూల స్పందన..
- God of War: ఎన్టీఆర్ - త్రివిక్రమ్ 'గాడ్ ఆఫ్ వార్'.. తొలిసారి నోరు విప్పిన మాటల మాంత్రికుడు.!
- Instagram Reels on TV: ఇన్స్టాగ్రామ్ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. ఇకపై మొబైల్ స్క్రీన్ కాదు.. నేరుగా టీవీలోనే రీల్స్..
- దొంగచాటుగా ఓటర్ల డేటాను యాక్సెస్ చేసిన Anthropic Claude AI.. ప్రభుత్వ డేటాబేస్‌ల భద్రతపై కొత్త ప్రశ్నలు..
పార్టీల వారీగా ఉపసంహరణల వివరాలు:
టీడీపీ: 121
వైసీపీ: 110
స్వతంత్ర అభ్యర్థులు: 75
జనసేన: 19
కాంగ్రెస్: 7
బీజేపీ: 6
సీపీఐ: 2
సీపీఎం: 1
ఇతర పార్టీలు: 5
తాజావార్తలు
-
AP Mayor Elections 2026: 13 కార్పొరేషన్లలో 346 నామినేషన్ల ఉపసంహరణ.. చిత్తూరులోనే అత్యధికం!
-
Hyundai Bayon SUV: Hyundai Bayon లాంచ్.. ధర రూ.9.99 లక్షలు, 1.5L ఇంజిన్‌తో కొత్త SUV!
-
Tummidihatti Barrage: తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణంపై మహారాష్ట్ర సీఎం సానుకూల స్పందన..
-
God of War: ఎన్టీఆర్ – త్రివిక్రమ్ ‘గాడ్ ఆఫ్ వార్’.. తొలిసారి నోరు విప్పిన మాటల మాంత్రికుడు.!
-
itel VistaTab 32: ఐటెల్ VistaTab 32 టాబ్లెట్ లాంచ్.. 8200mAh బ్యాటరీ, 11 ఇంచెస్ డిస్ప్లే, 8MP కెమెరా ఫీచర్లు ఇవే!
ట్రెండింగ్
-
Google Jobs: గూగుల్‌లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..
-
200MP డ్యూయల్ కెమెరా, 8,000mAh బ్యాటరీతో Oppo Find X10 ఫారెస్ట్ గ్రీన్ ఎడిషన్ లాంచ్..!
-
Devdutt Padikkal: ఒక్క పరుగు తేడాతో డబుల్ సెంచరీ మిస్.. అంపైర్ వివాదాస్పద నిర్ణయానికి దేవదత్ పడిక్కల్ బలి.!
-
Char Dham Yatra Closing Dates: చార్ధామ్ వెళ్లే భక్తులకు అలెర్ట్.. ఆ తేదీ నుండే మూతపడనున్న ఆలయాల తలుపులు..!
-
ఇంట్లోనే హోమ్ థియేటర్.. TCL 65 అంగుళాల 4K Google TV పై రూ. 60,000 భారీ డిస్కౌంట్..!