AP Local Body Elections 2026: నేడు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల.. అధికారిక ప్రకటనపై ఉత్కంఠ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Local Body Elections 2026: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) సిద్ధమైంది. బుధవారం ఉదయం 11:30 గంటలకు విజయవాడలోని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో ఎస్ఈసీ కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా స్థానిక ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేయనున్నారు. అదే సమయంలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను కూడా జారీ చేయనున్నారు. మంగళవారం ఎస్ఈసీ కమిషనర్ లోక్‌భవన్‌కు వెళ్లి గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్‌ను కలిశారు. స్థానిక సంస్థల ఎన్నికలకు బుధవారం షెడ్యూల్ జారీ చేస్తున్నట్లు చెప్పిన విషయం తెలిసిందే.
మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల కోసం ఈ నెల 16 నుంచి 18 వరకు నామినేషన్లు స్వీకరించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ నెల 21లోపు నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది. అనంతరం ఈ నెల 28న పోలింగ్ నిర్వహించి, 30న ఓట్ల లెక్కింపు చేపట్టే అవకాశమున్నట్లు సమాచారం. మరోవైపు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 19న నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. ఈ ఎన్నికల కోసం ఈ నెల 21 నుంచి 23 వరకు నామినేషన్లు స్వీకరణ, 27 వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం. నవంబర్ 3న పోలింగ్, నవంబర్ 5న ఓట్ల లెక్కింపు చేపట్టే అవకాశముందని తెలుస్తోంది.
Also Read
- 12,070mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో హానర్ నుంచి పవర్ఫుల్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్..!
- VB-G RAM G : ఎట్టకేలకు 20 ఏళ్ల కష్టానికి ఫలితం.. ఉపాధి హామీ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం..
- Explainer: యువత ఆరోగ్యానికి "రాజకీయ" గండం.. వీడియోలు, వార్తలతో మనశ్శాంతి కోల్పోతున్న యూత్..!!
- Temba Bavuma: కెప్టెన్‌గా మొదటి ఓటమి.. ప్రపంచ రికార్డుతో చరిత్ర సృష్టించిన బవుమా..!
స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుందన్న సమాచారంతో ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన రాజకీయ పార్టీల్లో ఆసక్తి నెలకొంది. కూటమి పార్టీలు టీడీపీ, జనసేన, బీజేపీ.. వైసీపీ పార్టీ ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. అన్ని పార్టీల్లోని ఆశావహులు, స్థానిక నాయకులు సన్నద్ధమవుతున్నారు. అయితే నామినేషన్లు, పోలింగ్, ఓట్ల లెక్కింపు తేదీలపై పూర్తి స్పష్టత రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారిక ప్రకటన వెలువడిన తర్వాతే రానుంది.
తాజావార్తలు
-
AP Local Body Elections 2026: నేడు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల.. అధికారిక ప్రకటనపై ఉత్కంఠ!
-
12,070mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో హానర్ నుంచి పవర్ఫుల్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్..!
-
VB-G RAM G : ఎట్టకేలకు 20 ఏళ్ల కష్టానికి ఫలితం.. ఉపాధి హామీ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం..
-
Explainer: యువత ఆరోగ్యానికి “రాజకీయ” గండం.. వీడియోలు, వార్తలతో మనశ్శాంతి కోల్పోతున్న యూత్..!!
-
Temba Bavuma: కెప్టెన్‌గా మొదటి ఓటమి.. ప్రపంచ రికార్డుతో చరిత్ర సృష్టించిన బవుమా..!
ట్రెండింగ్
-
IND vs WI 4th T20I: నేడు భారత్-వెస్టిండీస్ నాలుగో టీ20.. పిచ్ రిపోర్ట్, లైవ్ స్ట్రీమింగ్, ప్లేయింగ్ 11 ఇవే!
-
7 అంగుళాల Liquid Retina డిస్ప్లేతో ఇంటిని స్మార్ట్‌గా మార్చే Apple HomeView.. Siri AIతో అదిరిపోయే ఫీచర్లు..!
-
ఇక రిమోట్‌తో పనిలేదు.. వాయిస్‌తోనే ఫుల్ కంట్రోల్..! Siri AI, A19 చిప్‌తో కొత్త Apple TV 4K లాంచ్..
-
World Standards Day : మనం కొనే వస్తువులు నాణ్యమైనవేనా? ప్రతి వస్తువు వెనుక ఉన్న అసలు కథ ఇదే.!
-
Be Bald and Be Free Day : బట్టతల అంటే అందమే.. ఆత్మవిశ్వాసానికి కొత్త నిర్వచనం