AP Inter Results 2024: ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి.. విజయవాడలోని బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియెట్ ఎడ్యుకేషన్ కార్యాలయంలో ఇంటర్ ఫస్టియర్‌తో పాటు సెకండియర్ ఫలితాలను విడుదల చేశారు అధికారులు.. ఈ సారి దాదాపు 10 లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాశారు.. అయితే, ఇంటర్ ఫస్టియర్ ఫలితాల్లో 67 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.. ఇంటర్ సెకండియర్ ఫలితాల్లో 78 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఫస్టియర్ ఫలితాల్లో 84 శాతం ఉత్తీర్ణతతో కృష్ణి జిల్లా తొలి స్థానంలో ఉండగా.. సెకండియర్ ఫలితాల్లోనూ 90 శాతం ఉత్తీర్ణతతో కృష్ణా జిల్లాయే ప్రథమ స్థానంలో ఉంది..
Read Also: KP Nagarjuna Reddy: వైసీపీ విజయానికి కృషి చేయాలి.. కాపులకు ఎమ్మెల్యే పిలుపు..
ఇక, ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాల్లో 81 శాతంతో గుంటూరు జిల్లా సెకండ్ ప్లేస్‌లు ఉంది.. ఈ సందర్భంగా ఏపీ ఇంటర్ బోర్డు కార్యదర్‌శి సౌరబ్ గౌర్ మాట్లాడుతూ.. బాలికల ఉత్తీర్ణత శాతం బాలుర కంటే ఎక్కువగా ఉందని తెలిపారు.. ఇదే సమయంలో ఫెయిల్ అయిన స్టూడెంట్స్ తొందర పాటు చర్యలకు పూనుకోవద్దని విజ్ఞప్తి చేశారు.. తల్లి తండ్రులు.. పిల్లలకు సపోర్ట్ చేయాలని సూచించారు. ఫెయిల్ అయ్యారంటూ పిల్లలను అవమానించవద్దు అని పేరెంట్స్‌ను కోరారు.. ఈసారి తప్పిన విద్యార్థులు.. సప్లిమెంటరీ పరీక్షలు ఉన్నాయి.. ఈసారి మంచిగా రాసి.. మంచి ఫలితాలు రాబట్టాలని సూచించారు.. ఇక, ఏపీ ఇంటర్ ఫస్టియర్‌తో పాటు సెకండియర్ ఫలితాల కోసం కింది లింక్‌ను క్లిక్ చేసి.. ఫలితాలు తెలుసుకోండి..