NTV Telugu Site icon

Home Minister Anitha: లా అండ్ ఆర్డర్ విషయంలో ఎవరు తప్పుచేసినా వదిలే ప్రసక్తే లేదు..

Vangalapudi Anitha

Vangalapudi Anitha

Home Minister Anitha: లా అండ్ ఆర్డర్ విషయంలో ఎవరు తప్పుచేసినా వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు ఆంధ్రప్రదేశ్‌ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత.. విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడిన ఆమె.. ఇప్పటికీ కొంత మంది పోలీసు అధికారుల్లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రక్తం ప్రవహిస్తున్నట్లుగా వ్యవహారిస్తున్నారని మండిపడ్డారు.. మీకు ఇంకా జగన్ మోహన్ రెడ్డిపై ప్రేమవుంటే, ఉద్యోగానికి రాజీనామాలు చేసి ఆ పార్టీకోసం పనిచేసుకోండి అంటూ సలహా ఇచ్చారు.. కానీ, లా అండ్ ఆర్డర్ విషయంలో ఎవరు తప్పుచేసిన వదిలే ప్రసక్తే లేదని వార్నింగ్‌ ఇచ్చారు.. మహిళలకు అన్యాయం జరగకుండా చూస్తాను.. అవసరం మేరకు న్యాయ పోరాటం చేస్తాం అన్నారు. సింహాచలం దేవస్థానం భూములు ఒక్క గజం కూడా అన్యాక్రాంతం కావడానికి వీలు లేదన్నారు. పంచగ్రామాల భూ సమస్యకు త్వరలో పరిష్కారం లభిస్తుందని వెల్లడించారు హోంశాఖ మంత్రి అనిత..

Read Also: Sangareddy District : సైబర్ మోసం… రూ. 18 లక్షలు పోగొట్టుకున్న బాధితులు( వీడియో)

కాగా, ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత.. తన సొంత జిల్లాలో అడుగుపెట్టారు. జిల్లాలోపి టీడీపీ, జనసేన పార్టీల నేతల్ని వరుసగా కలుస్తూ.. అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ వస్తున్నారు.. ఇక, తాజాగా, అనకాపల్లిలో మాజీ మంత్రి, జనసేన ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణని మర్యాదపూర్వకంగా కలిసిన ఆమె.. ఈ సందర్భంలో కొణతాల రామకృష్ణ కాళ్లకు మొక్కారు.. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న విషయం విదితమే.

Show comments