NTV Telugu Site icon

AP Highcourt: అమరావతి R5 జోన్ పై హైకోర్టులో కీలక వాదనలు

High Court

High Court

అమరావతి R5 జోన్ పై హైకోర్టు విచారణలో కీలక వాదనలు జరిగాయి. ఇరువైపులా వాదనలు వినిపించారు పిటిషనర్స్, ప్రభుత్వం. ప్రభుత్వ న్యాయవాదుల వాదనల ప్రకారం R2 జోన్ లో 18 వేల ఎకరాలు రైతులకు కేటాయింపులు జరిగాయంది ప్రభుత్వం. R5 లో 700 ఎకరాలు మాత్రమే ఇళ్ల స్థలాలకు తీసుకున్నామంది ప్రభుత్వం. రైతులు సీఆర్డీఏ కి ఇచ్చిన భూమిని ప్రభుత్వం వివిధ అభివృద్ధి పనులకు వినియోగించుకోవచ్చని ప్రభుత్వం తన వాదనల్లో పేర్కొంది. 5 వేల టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించామని హైకోర్టుకి తెలిపింది ప్రభుత్వం.

Read Also: Mohammed Shami: షమీకి ఇప్పటికీ వివాహేతర సంబంధాలు ఉన్నాయి.. భార్య హసీన్ జహాన్ ఆరోపణలు

చాలా తక్కువ మందికి మాత్రమే కేటాయింపులు జరగాల్సి ఉందని కోర్టుకు తెలిపింది ప్రభుత్వం. పిటిషనర్స్ న్యాయవాదుల వాదనలు ఎలా ఉన్నాయంటే.. 5 వేల టిడ్కో ఇళ్ళు ఉండగా అవి కేటాయించకుండా…మళ్ళీ సెంటు భూమి ఇస్తున్నారని పిటిషనర్ తరఫు న్యాయవాదులు వాదించారు. రాజధానిలో అభివృద్ధి పనులను నిలిపివేసిన ప్రభుత్వం నవరత్నాల పేరిట ఇళ్ల స్థలాలు కేటాయిస్తోందని వాదించారు. ఇలా చేయడం అమరావతిలో మాస్టర్ ప్లాన్ మార్పు చేయడమేనని హైకోర్టుకి తెలిపారు.

టిడ్కో ఇళ్ళకి లబ్ధిదారుల ఎంపిక మాత్రమే జరిగింది తప్ప ఇంతవరకు ఇళ్ల కేటాయింపు జరగలేదనీ…వాళ్ళు ఇంకా ఆ ఇళ్లలోకి వెళ్లలేదన్న పిటిషనర్ తరుపు న్యాయవాది వాదించారు. గతంలో ఇదే తరహాలో జీవో లు ఇస్తే హైకోర్టు నిలుపుదల చేసిందని హైకోర్టు దృష్టికి తీసుకు వచ్చారు పిటిషనర్ తరుపు న్యాయవాది. ఇరుపక్షాల వాదనలు అనంతరం తీర్పు రిజర్వ్ చేసింది హైకోర్టు. దీనిపై ఎల్లుండి ఉత్తర్వులు ఇస్తామని హైకోర్టు వెల్లడించింది.

Read Also: Mohammed Shami: షమీకి ఇప్పటికీ వివాహేతర సంబంధాలు ఉన్నాయి.. భార్య హసీన్ జహాన్ ఆరోపణలు