AP High Court: ప్రభుత్వ భూముల ఆక్రమణలకు సంబంధించిన కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రైల్వే ఓవర్‌బ్రిడ్జి నిర్మాణం కోసం తమ ఆధీనంలో ఉన్న భూములు తీసుకున్నందుకు పరిహారం చెల్లించాలని కోరుతూ కొందరు పిటిషనర్లు దాఖలు చేసిన వ్యాజ్యంపై విచారణ చేపట్టిన హైకోర్టు, పిటిషనర్ల వాదనలను తిరస్కరించింది. దీర్ఘకాలంగా ఒక ప్రాంతంలో నివసిస్తున్నంత మాత్రాన భూమిపై యాజమాన్య హక్కు వస్తుందని భావించలేమని కోర్టు స్పష్టం చేసింది.
Vivo V70 Elite Look: ప్యాషన్ రెడ్‌లో అదిరిపోయే లుక్.. అందరి చూపులన్నీ ‘వివో వీ70 ఎలైట్’పైనే!
చట్టబద్ధమైన యాజమాన్య పత్రాలు లేకపోతే 2013 భూసేకరణ చట్టం కింద వారు భూ యజమానులుగా పరిగణించబడరని తెలిపింది. యాజమాన్య హక్కు లేని ఆక్రమణదారులు అసలైన భూ యజమానులతో సమానంగా పరిహారం కోరలేరని కోర్టు పేర్కొంది. భూమి లేదా ఆస్తిపై చెల్లుబాటు అయ్యే యాజమాన్య హక్కులు కలిగి ఉన్నవారికి మాత్రమే 2013 భూసేకరణ చట్టం కింద పరిహారం వర్తిస్తుందని హైకోర్టు తేల్చిచెప్పింది. పిటిషనర్లు కోరిన విధంగా పరిహారం చెల్లించాల్సిన అవసరం లేదని కూడా కోర్టు అభిప్రాయపడింది.
China: ‘హై పవర్ మైక్రోవేవ్’ వెపన్ తయారు చేసిన చైనా.. దీని వల్ల ప్రమాదం ఏంటంటే.?
ఇప్పటికే ప్రభుత్వం పిటిషనర్లకు ప్రత్యామ్నాయ గృహ వసతి కల్పించిన విషయాన్ని హైకోర్టు గుర్తుచేసింది. చట్టబద్ధమైన యాజమాన్య హక్కులు లేదా పట్టా హక్కులు ఉన్నవారికే, లేక కోర్టు ద్వారా యజమానులుగా గుర్తింపు పొందినవారికే భూసేకరణ చట్టం కింద ప్రయోజనాలు వర్తిస్తాయని తెలిపింది. అలాగే పలువురు అధికారులపై దాఖలు చేసిన కోర్టుదిక్కార పిటిషన్లను కూడా హైకోర్టు కొట్టివేసింది.
