NTV Telugu Site icon

AP State Finance Commission: ఫైనాన్స్ కమిషన్ ఏర్పాటు హామీ ఏమైంది?

apsfc

Collage Maker 19 Jan 2023 04.50 Pm

ఏపీ హైకోర్టు లో ఏపీ స్టేట్ ఫైనాన్స్ కమీషన్ ఏర్పాటుపై హైకోర్టులో విచారణ జరిగింది. ఫైనాన్స్ కమిషన్ ఏర్పాటు చేయకపోవడం రాజ్యాంగ విరుద్దమని హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసిన టిడిపి నేత జీవీరెడ్డి. 3 నెలల్లో కమీషన్ ఏర్పాటు చేస్తామని గతంలో హైకోర్టు ముందు చెప్పిన ప్రభుత్వ న్యాయవాది దానిని అమలుచేయలేదు. చెప్పిన గడువు ముగిసినా కమీషన్ ఏర్పాటుచేయలేదని హైకోర్టు దృష్టికి తెచ్చారు పిటిషనర్ తరఫు న్యాయవాది. కమిషన్ ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించింది ధర్మాసనం.

Read Also:Nitish Kumar: “నాకు ఒకే కల మిగిలి ఉంది”.. కేసీఆర్ సభపై నితీష్ కుమార్..

ఫైల్ రెడీ చేశాం, గవర్నర్ వద్ద ఉంది.. త్వరలో ఏర్పాటు చేస్తామన్న ప్రభుత్వ న్యాయవాది. నిర్ణీత సమయంలో ఏర్పాటు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని ధర్మాసనాన్ని అభ్యర్ధించారు పిటిషనర్ తరపు న్యాయవాది. గవర్నర్ వద్ద ఫైల్ ఉన్నప్పుడు ఆదేశించడం సరికాదని అభిప్రాయపడింది ధర్మాసనం. సాధ్యమైనంత త్వరగా ఏర్పాటు చేస్తామని ధర్మాసనానికి హామీ ఇచ్చారు జీపీ. తదుపరి విచారణ ఫిబ్రవరి 20కి వాయిదా వేసింది ధర్మాసనం.

Read Also: Today (19-01-23) Business Headlines: AI స్వర్ణ యుగంలోకి ప్రపంచ దేశాలు. మరిన్ని వార్తలు.