పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సహా ఎమ్మెల్యే అభ్యర్థుల ముందస్తు బెయిల్ పిటిషన్లపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. జూన్ 5వ తేదీ వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని తెలిపింది. తదుపరి విచారణ జూన్ 6కి వాయిదా వేస్తున్నట్లు పేర్కొనింది. సాక్షులను ప్రభావితం చేయకూడదంటూ అభ్యర్థులకు షరతు విధించింది. అలాగే, ఎమ్మెల్యే అభ్యర్థులపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఈసీకి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఎమ్మెల్యే అభ్యర్థులు కౌంటింగ్ ప్రక్రియ పర్యవేక్షించాలని, కౌంటింగ్ ఏజెంట్లను మానిటర్ చేయాలి కాబట్టి.. అభ్యర్థులపై ముందస్తు చర్యలు తీసుకోకుండా చూడాలన్న పిటిషనర్ వాదనలతో ఏకీభవించిన కోర్టు.. అభ్యర్థులు కాకుండా కేసుల్లో నిందితులుగా ఉన్న వారి.. ముందస్తు బెయిల్ పిటిషన్లను ఈ నెల 30వ తేదీన విచారిస్తామన్న హైకోర్టు వెల్లడించింది.
Read Also: Ambala Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి, 20 మందికి పైగా గాయాలు
కాగా, అనంతపురం జిల్లాలోని తాడిపత్రిలో వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డితో పాటు టీడీపీ అభ్యర్థి జేసి అస్మిత్ రెడ్డిలకు కూడా హైకోర్టులో ఊరట దక్కింది. జూన్ 6వ తేదీ వరకు అరెస్టు చేయవద్దు అంటూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. నియోజకవర్గంలోకి వెళ్ళవద్దంటూ కేతిరెడ్డి పెద్దారెడ్డి, జేసీ అస్మిత్ రెడ్డికి న్యాయస్థానం సూచించింది. తాడిపత్రిలో కౌంటింగ్ పూర్తి అయ్యే వరకు సిట్ అధికారులు జిల్లాలోనే మకాం వేయనున్నారు. ఇప్పటికే 639 మంది అల్లర్లు , రాళ్లదాడిలో పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. కాగా, 102 మందిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. అల్లర్లలో పాల్గొన్న నిందితులందరూ ఇతర రాష్ట్రాల్లో తలదాచుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితులను అరెస్టు చేయడానికి చర్యలు వేగవంతం చేసిన పోలీసు అధికారులు.. కౌంటింగ్ రోజు తాడిపత్రిలోకి బయట వారు రాకుండా అష్టదిగ్బంధం చేయడానికి అధికారుల కసరత్తు చేస్తున్నారు.