NTV Telugu Site icon

APPSC Group 1 Main Exam: గ్రూప్‌-1 మెయిన్స్‌ రద్దు చేసిన ఏపీ హైకోర్టు!

Pawan Kalyan

Pawan Kalyan

APPSC Group 1 Main Exam 2018 Canceled: తాజాగా ఏపీ హైకోర్టు 2018 లో జరిగిన గ్రూప్‌-1 మెయిన్స్‌ ను రద్దు చేసింది. ఈ పరీక్షలకి సంబంధించి ప్రశ్నపత్రాల డిజిటల్‌ వాల్యుయేషన్‌ పై కొందరు అభ్యర్థులు పిటిషన్‌ వేశారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జులై 22, 2022లో 2018 గ్రూప్-1 పరీక్షల ఫలితాలను విడుదల చేసింది. అయితే ఇందులో అనుమానాలున్నాయని కొందరు అభ్యర్థులు ఏపీ హైకోర్టులో పిటిషన్‌ వేయగా గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష ఫలితాలను నిలిపి వేయడం జరిగింది. ఈ ప్రక్రియకి సంబంధించి జవాబు పత్రాల మాన్యువల్ మూల్యాంకనానికి తిరిగి రావాలని ఏపీపీఎస్సిని కోర్టు ఆదేశించింది. తాజాగా ఈ పరీక్షను రద్దు చేసిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రాబోయే 6 నెలల లోపై ఎగ్జామ్‌ తిరిగి పెట్టాలని చెప్పింది.

ఇక మరోవైపు చూస్తే.. ప్రస్తుతం జరగబోయే గ్రూప్‌-1 ఎగ్జామ్స్‌ కు సర్వం సిద్ధమైంది. ఏపీపీఎస్సి గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను మార్చి 17న నిర్వహించబోతుంది. ఆఫ్‌లైన్ లో ఉదయం 10 నుండి మధ్యాహ్నం 12 వరకు పరీక్ష పేపర్ 1, ఆ తర్వాత మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు పేపర్ 2 ను రెండు షిఫ్టులలో జరుపనున్నారు. ఈ పరిక్షలు రాష్ట్రవ్యాప్తంగా కేవలం 18 జిల్లా కేంద్రాల్లో రాత పరీక్ష జరగబోతుంది. జరగబోయే ప్రిలిమ్స్ పరీక్షలో ఉత్తీర్ణత అయినవారు మాత్రమే మెయిన్స్ పరీక్షకు హాజరయ్యేందుకు అర్హులు. ఈ నోటిఫ్కేషన్ లో మొత్తం 81 పోస్టుల భర్తీ కోసం ఏపీపీఎస్సీ గ్రూప్-1 పరిక్ష నిర్వహిస్తోంది.

Also Read: Yarlagadda Venkat Rao: ఏపీలో వచ్చేది టీడీపీ-జనసేన సంకీర్ణ ప్రభుత్వమే: యార్లగడ్డ

ఇక ఈ పరీక్ష అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ కోసం.. ముందుగా APPSC అధికారిక పోర్టల్‌ psc.ap.gov.in ని సంప్రదిందించాలి. ఆపై హోమ్‌పేజీలో ఏపీపీఎస్సీ గ్రూప్ 1 అడ్మిట్ కార్డ్ – 2024 డౌన్‌లోడ్ లింక్‌ ను వెతకాలి. ఆపై వచ్చిన లింక్‌ పై క్లిక్ చేస్తే లాగిన్ పేజీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను ఇచ్చి లాగిన్ అవ్వాలి. దాంతో మీ ఏపీపీఎస్సీ హాల్ టిక్కెట్ 2024 స్క్రీన్‌ పై కనపడుతుంది.