AP Govt: ఏపీలో టెక్నాలజీ విప్లవం.. మూడు నూతన పాలసీలకు ఉత్తర్వులు జారీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్రంలో సాంకేతిక విప్లవాన్ని తీసుకురావడంతో పాటు పారిశ్రామిక అభివృద్ధిని పరుగులు పెట్టించే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించి, యువతకు భారీ స్థాయిలో ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో ఏకంగా మూడు నూతన టెక్నాలజీ పాలసీలకు సంబంధించి ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్, ఎక్స్టెండెడ్ రియాలిటీ (AVGC-XR), రోబోటిక్స్, సెమీకండక్టర్ రంగాలలో ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టేలా ఈ విధానాలను రూపొందించారు.
ఈ నూతన విధానాలలో భాగంగా రాజధాని అమరావతి వేదికగా 200 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో అత్యధునాతన AVGC పార్క్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల డిజిటల్ ఎంటర్టైన్మెంట్, గేమింగ్ రంగాలలో సృజనాత్మకత కలిగిన యువతకు స్థానికంగానే మెరుగైన వేదిక లభించనుంది. అలాగే, భవిష్యత్ పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా రోబోటిక్స్ తయారీ, పరిశోధన, అభివృద్ధి రంగాలను ప్రోత్సహించేందుకు ప్రత్యేక రాయితీలు, ఆర్థిక ప్రోత్సాహకాలను ప్రకటించింది.
Also Read
- Kulgam Encounter: కుల్గాం దాడి సూత్రధారి లతీఫ్ భట్ హతం.. ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు మృతి
- Gully Cricket: చిన్ టెండూల్కర్‌తో గల్లీ క్రికెట్ ఆడిన ప్రిన్స్ విలియం, కేట్..!
- Minister Ramprasad Reddy: గడికోట శ్రీకాంత్ రెడ్డికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి మాస్ వార్నింగ్.. నేరుగా తేల్చుకుందాం..!
- Teja Sajja Engagement: ఘనంగా తేజ సజ్జా నిశ్చితార్థ వేడుక.. హాజరైన ప్రముఖులు..!
మరోవైపు.. ప్రపంచవ్యాప్తంగా అత్యంత కీలకంగా మారిన చిప్ తయారీ రంగంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు సెమీకండక్టర్ పాలసీకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది. ఇందుకోసం రాష్ట్రంలో ఏకంగా 5 వేల ఎకరాల భూమిని కేటాయించి ప్రత్యేక సెమీకండక్టర్ పార్క్‌ను అభివృద్ధి చేయనున్నారు. అంతర్జాతీయ స్థాయి కంపెనీలు రాష్ట్రానికి తరలివచ్చేలా మౌలిక సదుపాయాలు కల్పించనున్నారు. ఈ మూడు పాలసీల అమలు ద్వారా రానున్న రోజుల్లో వేల కోట్ల రూపాయల పెట్టుబడులు రావడమే కాకుండా, సాంకేతిక నైపుణ్యం కలిగిన లక్షలాది మంది యువతకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
తాజావార్తలు
-
AP Govt: ఏపీలో టెక్నాలజీ విప్లవం.. మూడు నూతన పాలసీలకు ఉత్తర్వులు జారీ..
-
Kulgam Encounter: కుల్గాం దాడి సూత్రధారి లతీఫ్ భట్ హతం.. ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు మృతి
-
Gully Cricket: చిన్ టెండూల్కర్‌తో గల్లీ క్రికెట్ ఆడిన ప్రిన్స్ విలియం, కేట్..!
-
Egg: గుడ్ల ధరలు ఎందుకు పెరుగుతున్నాయ్?
-
Minister Ramprasad Reddy: గడికోట శ్రీకాంత్ రెడ్డికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి మాస్ వార్నింగ్.. నేరుగా తేల్చుకుందాం..!
ట్రెండింగ్
-
Mohit Ulva: ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు.. ఎవరీ మోహిత్ ఉల్వా.. జడేజా కోచ్ దగ్గరే శిక్షణ!
-
ICC Chairman-Jay Shah: రెండోసారి ఐసీసీ చైర్మన్‌గా జై షా.. ఈసారి కూడా ఏకగ్రీవమే!
-
Vaibhav Sooryavanshi: సచిన్ టెండూల్కర్ అవుతాడో లేక వినోద్ కాంబ్లీ అవుతాడో చెప్పడం కష్టం..!
-
India Schedule: రోహిత్, కోహ్లీ మళ్లీ ఆడేది అప్పుడే.. టీమిండియా నెక్స్ట్ షెడ్యూల్ ఇదిగో..!
-
Tata Motors దూకుడు మాములుగా లేదుగా.. 10 నెలల్లోనే గతేడాది లెక్కలు తారుమారు.!