తొమ్మిది గంటల ఉచిత విద్యుత్తు ఎత్తివేతపై మంత్రి గొట్టిపాటి రవికుమార్ క్లారిటీ ఇచ్చారు. వ్యవసాయానికి 9 గంటల ఉచిత విద్యుత్తు ఇవ్వడానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. వైసీపీ నేతలు మీడియా ముసుగులో పదే పదే విష ప్రచారం సాగిస్తున్నారని మండిపడ్డారు. 11 సీట్లకు వైసీపీని ప్రజలు పరిమితం చేసిన ఆ పార్టీ నాయకుల బుద్ధి మారలేదన్నారు. వైసీపీ నేతలు.. మొన్నటి వరకూ వ్యవసాయ మోటర్లకు మీటర్లు బిగిస్తున్నామని చేసిన విష ప్రచారం బెడిసికొట్టిందన్నారు. ఇప్పుడు 9 గంటల ఉచిత విద్యుత్తు ఎత్తివేస్తున్నామని మరో అసత్య ప్రచారానికి తెరలేపారన్నారు.
READ MORE: RG Kar Case Verdict: కోల్‌కతా వైద్యురాలి కేసులో సంచలనం.. దోషిగా సంజయ్ రాయ్..
9 గంటల ఉచిత విద్యుత్తు ఇవ్వడంలో ఎలాంటి మార్పులు లేవని విద్యుత్తు శాఖ మంత్రి తెలిపారు. ఉచిత విద్యుత్ విషయంలో ఓ పత్రిక ప్రజలను తప్పు దోవ పట్టించాలని ప్రయత్నిస్తోందన్నారు. అసత్య వార్తలను ప్రచురించి, ప్రజలను తప్పుదోవ పట్టించే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. జగన్ విధ్వంస పాలనకు, చంద్రబాబు సంక్షేమ పాలనకు మధ్య ఎంతో తేడా ఉందన్నారు.
READ MORE: Breaking News: హైదరాబాద్ నగరంలో మరోమారు భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు